Voter Rights Yatra: రాహుల్.. ప్రియాంక.. మధ్యలో రేవంత్!
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:49 AM
ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి.. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
బిహార్‌లో అత్యంత ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు
ఢిల్లీ నుంచి వారితోపాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం
రాహుల్, ప్రియాంకతో కలిసి ఓటర్ అధికార్ యాత్రలో..
బిహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్‌గాంధీతో చర్చ
తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా!
రేవంత్‌తోపాటు పాల్గొన్న మహేశ్‌గౌడ్, మంత్రులు
ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి రాక వ్యక్తిగత దాడులే ఆర్‌ఎ్‌సఎస్ విధానం గాంధీజీపైనా వారు అదే పని చేశారు: రాహుల్‌గాంధీ
కుట్రతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు: ప్రియాంకాగాంధీ
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి.. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మంగళవారం ఢిల్లీ నుంచి బిహార్ రాష్ట్రంలోని దర్భంగా వరకు ప్రత్యేక విమానంలో వెళ్లిన ఇద్దరు నేతలు.. రేవంత్‌రెడ్డిని కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. ఓటర్ అధికార్ యాత్రలో కూడా రాహుల్, ప్రియాంకతోపాటే ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తనకు ఇరువైపులా.. రాహుల్, ప్రియాంకతో ఆ యాత్రలో రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు.. రేవంత్‌తో బిహార్ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రాహుల్‌గాంధీ ముచ్చటించారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. దీనిపై మంత్రుల కమిటీ నియామకం, న్యాయ నిపుణుల సూచన మేరకు ముందుకెళ్లాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించారు. దీనిపై ఈ నెల 30న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. కాగా, ఓటరు అధికార యాత్రలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాత్ర ముగిసిన తర్వాత.. దర్భంగా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం, మంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..