BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ జెండా ఎగరాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:16 AM
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ తో కలిసి ఆయన సమావేశమయ్యారు.
- రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్ సిటీ: రాబోయే జూబ్లీహిల్స్(Jubli Hills) ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు(N. Ramachandar Rao) అన్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ తో కలిసి ఆయన సమావేశమయ్యారు. గత బీఆర్‌ఎస్(BRS) సర్కారు వ్యవహరించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజావ్యతిరేక విధానాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని రామచందర్ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గౌతంరావు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News