Share News

Minister Jupally on Congress: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 12 , 2025 | 03:06 PM

మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Minister Jupally on Congress: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
Minister Jupally Krishna Rao on Congress

ఆదిలాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలుస్తుందో లేదో తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే తాను హామీలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. తన వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తానని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.


తన నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వనని తెలిపారు. ప్రజలకు ఏం పనులు కావాలో వాటిని మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ఇవాళ (శుక్రవారం) బోథ్‌లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే, మంత్రి జూపల్లి చేసిన ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ(TPCC) ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 12 , 2025 | 03:39 PM