Share News

U19 WC 2026: టీమిండియా జట్టు ప్రకటన.. ఆ మ్యాచులకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

ABN , Publish Date - Dec 27 , 2025 | 08:52 PM

అండర్ 19 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ టోర్నీ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్నాయి. కాగా ఈ ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియా అండర్ 19 జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

U19 WC 2026: టీమిండియా జట్టు ప్రకటన.. ఆ మ్యాచులకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!
U19 WC 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా యువ జట్టును శనివారం అధికారికంగా ప్రకటించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్నాయి. కాగా ఈ ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియా అండర్ 19 జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.


ఈ అండర్‌–19 ప్రపంచ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్‌ దశ.. అనంతరం సూపర్‌ సిక్స్‌, సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ పోరు హరారేలో నిర్వహించనున్నారు.


ఐదు సార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ (2000, 2008, 2012, 2018, 2022)ను గ్రూప్‌–బీలో న్యూజిలాండ్‌, అమెరికా (యూఎస్‌ఏ), బంగ్లాదేశ్‌లతో కలిసి ఉంచారు. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జనవరి 15న బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో యూఎస్‌ఏతో ఆడనుంది. అదే మైదానంలో జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.


భారత్‌ అండర్‌–19 ప్రపంచకప్‌ జట్టు:

ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, ఆరోన్‌ జార్జ్‌, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్ కుందూ (వికెట్‌కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ పటేల్‌, మహ్మద్‌ ఎనాన్‌, హెనిల్‌ పటేల్‌, డి. దీపేశ్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌, ఉధవ్‌ మోహన్‌.


మూడు వన్డేల కోసం..

ఇదిలా ఉండగా, ఆయుష్‌ మాత్రే, విహాన్‌ మల్హోత్రా చేతి మణికట్టు గాయాలతో బాధపడుతున్న కారణంగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యారు. గాయాల చికిత్స కోసం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు హాజరుకానున్న వీరు, పూర్తిగా కోలుకున్న తర్వాత అండర్‌–19 ప్రపంచకప్‌కు జట్టుతో కలవనున్నారు. అప్పటి వరకు జట్టును యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నడపనున్నాడు.


దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు:

వైభవ్‌ సూర్యవంశీ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ (వైస్‌ కెప్టెన్‌), వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్ కుందూ (వికెట్‌ కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్‌.ఎస్‌. అంబ్రిష్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ పటేల్‌, మహ్మద్‌ ఎనాన్‌, హెనిల్‌ పటేల్‌, డి. దీపేశ్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌, ఉధవ్‌ మోహన్‌, యువరాజ్‌ గోహిల్‌, రాహుల్‌ కుమార్‌.


ఇవి కూడా చదవండి

తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!

ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్

Updated Date - Dec 27 , 2025 | 09:53 PM