Rohit Sharma-Shama Mohamad: రోహిత్ లావుగా ఉంటాడు.. కాంగ్రెస్ మహిళా నేత షాకింగ్ కామెంట్
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:28 PM
Rohit Sharma: రోహిత్ ఫిట్‌గా ఉండడని, లావుగా ఉంటాడంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీకి దారి తీశాయి.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ మహిళా నేత, అధికారిక ప్రతినిధి షామా మొహమ్మద్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను శరీరాకృతిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీకి తెరలేపాయి. బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టడంతో కాంగ్రెస్ చిక్కుల్లో పడినట్టైంది. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్న హస్తం పార్టీ.. .ఆ మహిళా నేతను తన పోస్టు డిలీట్ చేయాలని సూచించింది (Rohit Sharma - Body Shaming).
కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ అకస్మాత్తుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు. ‘‘రోహిత్ శర్మ ఓ క్రీడాకారుడిలా కాకుండా లావుగా ఉంటాడు. అతడు కచ్చితంగా బరువు తగ్గాలి. అసలేమాత్రం ఆకట్టుకునేలా ఉండని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కరే’’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు అడుక్కోవడం అలవాటైంది: కేంద్ర మాజీ మంత్రి
ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఆమెపై విమర్శలు గుప్పించారు. రోహిత్ ప్రపంచస్థాయి క్రీడాకారుడు అంటూ మద్దతుగా నిలిచారు. అయితే, షామా మాత్రం తన కామెంట్స్‌ను గట్టిగా సమర్థించుకున్నారు. ‘‘మునుపటి టీమిండియా కెప్టెన్లతో పోలిస్తే రోహిత్‌కు అంతటి ప్రపంచస్థాయి ఏముంది? అతడో సాధారణ స్థాయిగల కెప్టెన్. క్రీడాకారుడిగా కూడా అతడిది సాధారణ స్థాయియే. అదృష్టం కొద్దీ టీమిండియా కెప్టెన్సీ లభించింది’’ అంటూ కామెంట్ చేశారు. ఆ తరువాత ఆ పోస్టు తొలగించినప్పటికీ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు. క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలని మాత్రమే అన్నాను. అతడు బరువు ఎక్కువగా ఉన్నాడని అనిపించింది. అదే విషయాన్ని చెప్పాను’’ అని ఆమె అన్నారు.
UNESCO Report: చదువు.. అర్థమయ్యే భాషలో ఉండట్లేదు
ఈ వ్యాఖ్యలపై బీజేపీ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి బాడీ షేమింగ్‌కు దిగారని, ప్రపంచకప్ విజేతను దారుణంగా అవమానించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిన రాధికా ఖేర్ కాంగ్రెస్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. క్రీడాకారులను కాంగ్రెస్ దశాబ్దాలుగా అవమాన పరుస్తోందని అన్నారు. ఆశ్రితపక్షపాతం ప్రదర్శించే పార్టీ సొంతంగా పైకెదిగిన క్రీడాకారుడిని విమర్శిస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రోహిత్ ఇండియాను విజేతగా నిలిపితే రాహుల్ గాంధీ తన పార్టీ నిర్వహణలో తడబడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉనికికోల్పోకుండా చూసుకోవాలని జైరామ్ రమేశ్‌కు కూడా చురకలంటించారు.
మరోవైపు, కాంగ్రెస్ ఈ కాంట్రవర్సీకి దూరం జరిగే ప్రయత్నం చేసింది. ‘‘దేశానికి క్రీడాకారులు చేసిన సేవకు కాంగ్రెస్ అత్యున్నత గౌరవం ఇస్తుంది’’ అని ఆ నేత పవన్ ఖేరా అన్నారు. రోహిత్‌ను విమర్శిస్తూ పెట్టిన పోస్టును తొలగించాలని షామాను కోరినట్టు కూడా వెల్లడించారు.