Share News

UNESCO Report: చదువు.. అర్థమయ్యే భాషలో ఉండట్లేదు

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:39 AM

కొన్ని అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో వీరి సంఖ్య 90శాతం వరకూ ఉందని పేర్కొంది. స్థానిక భాష ప్రాధాన్యంపై పలు దేశాల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల సామర్థ్యం పరిమితంగా ఉండటం,

UNESCO Report: చదువు.. అర్థమయ్యే భాషలో ఉండట్లేదు

ప్రపంచ జనాభాలో 40% మంది పరిస్థితి ఇదే: యునెస్కో

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రపంచ జనాభాలో 40శాతం మందికి వారు మాట్లాడే లేదా అర్థం చేసుకొనే భాషలో విద్య అందుబాటులో లేదని యునెస్కోకు చెందిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ (జీఈఎం) బృందం తెలిపింది. కొన్ని అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో వీరి సంఖ్య 90శాతం వరకూ ఉందని పేర్కొంది. స్థానిక భాష ప్రాధాన్యంపై పలు దేశాల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల సామర్థ్యం పరిమితంగా ఉండటం, తగినంత మెటీరియల్‌ అందుబాటులో లేకపోవడం, సమాజంలో వ్యతిరేకత తదితర సవాళ్లతో విధానపరమైన అమలు పరిమితంగానే ఉందని వెల్లడించింది. దీనివల్ల 25కోట్ల మందికిపైగా విద్యార్థులు ప్రభావితమయ్యారని వివరించింది. అందువల్ల విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా అన్ని దేశాల్లోనూ బహు భాషా విధానాలను అమలు చేయాలని సిఫారసు చేసింది. బహు భాషా విధానాన్ని సమర్థించే నూతన విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) భారత్‌లో అమలు చేస్తున్న సమయంలో ఈ నివేదిక వెలువడింది.

Updated Date - Mar 03 , 2025 | 01:40 AM