Share News

Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:42 PM

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.

Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?
Melbourne Pitch

ఇంటర్నెట్ డెస్క్: తొలి రోజే 20 వికెట్లు.. మరో రోజు 16 వికెట్లు.. ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజులకే ముగిసింది. ఇదంతో ఏ మ్యాచ్ గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది గా! యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల హవా కొనసాగింది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పెర్త్ పిచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగినప్పటికీ ఐసీసీ మాత్రం ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇవ్వడంపై క్రికెట్ మాజీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మెల్‌బోర్న్ పిచ్‌(Melbourne Pitch)కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.


‘ఎంసీజీ పిచ్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉంది. మొదటి రోజు 20 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. ఒక్క బ్యాటర్ కూడా కనీసం అర్ధ శతకం చేయలేకపోయాడు. ఈ పిచ్‌కు ‘అసంతృప్తికరం’ అని రేటింగ్ ఇస్తున్నాం. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియానికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించాం’ అని మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ తెలిపారు. ఐసీసీ(ICC) పిచ్ రేటింగ్ వ్యవస్థలో ‘వెరీ గుడ్’, సంతృప్తికరం, అసంతృప్తికరం, అన్‌ఫిట్ అనే నాలుగు కేటగిరీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. గత మూడు బాక్సింగ్ డే టెస్టులకు ఎంసీజీ ‘వెరీ గుడ్’ రేటింగ్ పొందడం గమనార్హం.


సిరీస్ విషయానికొస్తే..

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతున్నాయి. నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి ఆసీస్ 3-1తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చేసిన 46 పరుగులే అత్యధిక స్కోరు. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ జనవరి 4 నుంచి సిడ్నీలో ప్రారంభంకానుంది.


ఇవి కూడా చదవండి

రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్

మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?

Updated Date - Dec 29 , 2025 | 04:42 PM