Sonam Yeshe: 4 ఓవర్లు.. 8 వికెట్లు.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:11 PM
టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీ20 చరిత్రలో ఏ ఆటగాడు సాధించని ఘనతను అతడు అందుకున్నాడు. మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేశాడు.
127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ బ్యాటర్లు యేషే స్పిన్ ముందు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ ప్రదర్శనతో టీ20 ఫార్మాట్‌లో.. ఒకే మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా యేషే(Sonam Yeshe) రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు పురుషుల టీ20 అంతర్జాతీయాల్లో గరిష్ఠంగా 7 వికెట్లు మాత్రమే నమోదయ్యాయి.
ఈ సిరీస్ మొత్తంలోనూ యేషే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి భూటాన్ విజయాలకు కీలకంగా నిలిచాడు. 2022లో మలేసియా తరఫున టీ20ల్లోకి అరంగేట్రం చేసిన యేషే.. ఈ అద్భుత స్పెల్‌తో తన కెరీర్ 37 వికెట్లు తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?