Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. మెస్సిని వెనక్కి నెట్టి!
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:22 PM
సౌదీ ప్రో లీగ్‌లో పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టయానో రొనాల్డో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అల్ నస్ర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో అల్ అఖ్‌డౌద్‌తో జరుగుతున్న మ్యాచులో రెండు గోల్స్ కొట్టి.. 14 సార్లు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 40 గోల్స్ కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్ నస్ర్ తరఫున అల్ అఖ్‌డౌద్‌తో జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. రెండు గోల్స్ సాధించిన రొనాల్డో(Cristiano Ronaldo).. 2025 క్యాలెండర్ సంవత్సరంలో 40 గోల్స్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో లియోనెల్ మెస్సీని వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే 14 సార్లు ఏడాదిలో 40కిపైగా గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ లీగ్‌లో అల్ నస్ర్ 3-0తో విజయం సాధించింది. సౌదీ ప్రో లీగ్ చరిత్రలోనే వరుసగా పదో మ్యాచులు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్ నస్ర్ రికార్డు సృష్టించింది. రొనాల్డో 31వ నిమిషంలో ఓ గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. చివరి నిమిషాల్లో జోవో ఫెలిక్స్ మరో గోల్ జోడించాడు. బాక్స్‌లో చురుకైన కదలికలతో రొనాల్డో మరోసారి తన క్లాస్‌ను చాటాడు.
మెస్సిని వెనక్కి నెట్టి..
ఈ ఏడాది రొనాల్డో క్లబ్ స్థాయిలో 32 గోల్స్, పోర్చుగల్ జాతీయ జట్టుకు 8 గోల్స్ చేశాడు. అదనంగా నాలుగు అసిస్టులు కూడా అందించాడు. మొత్తంగా ఇది అతని కెరీర్‌లో 14 సార్లు ఒకే ఏడాదిలో 40కిపైగా గోల్స్ వేశాడు. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి(Lionel Messi)ని అధిగమించాడు. మెస్సి ఈ ఘనతను 13 సార్లు మాత్రమే ఒకే సంవత్సరంలో 40 సార్లు గోల్స్ సాధించగలిగాడు. రొనాల్డో, మెస్సిల తర్వాత రాబర్ట్ లెవాండోవ్‌స్కీ (9 సార్లు), ఎంబాపే, హ్యారీ కేన్, హాలాండ్ (తలో 5 సార్లు) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. నాలుగు సార్లు (2011–14) ఏడాదిలో 60కిపైగా గోల్స్ చేసిన ఘనత కూడా రొనాల్డోదే.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?