Gautam Gambhir: గంభీర్ ‘రంజీ’ కోచ్‌గా మారాలి.. మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:35 PM
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. జట్టుపై ప్రయోగాలు చేయడం వల్లే స్వదేశంలో టెస్టుల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అయిందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్(Monty Panesar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
‘గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్ వరకు అద్భుతమైన కోచ్. ఈ ఫార్మాట్లో అతడు విజయవంతమయ్యాడు. రంజీ ట్రోఫీలో ఏదైనా టీమ్‌కు కోచ్‌గా మారితే అతడికి మేలు జరుగుతుంది. రెడ్ బాల్ క్రికెట్‌లో ఓ జట్టును ఎలా నిర్మించాలో తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో బలహీనంగా కనిపిస్తోంది. తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ముగ్గురు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకుంటే.. మిగతా ప్లేయర్లు సిద్ధం కావడం కాస్త కష్టమే’ మాంటీ పనేసర్ అన్నాడు.
గిల్‌లో అదొక్కటే మైనస్..
అలాగే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీ గురించి కూడా మాంటీ పనేసర్ మాట్లాడాడు. ‘గిల్‌లో చాలా ప్రతిభ ఉంది. కానీ అతడి షాట్ సెలక్షన్ సరిగా లేదు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ దూకుడు, పరిణితి మనకు కనిపిస్తాయి. కానీ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అది లోపిస్తోంది. అలాగే అన్ని ఫార్మాట్లకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించలేడు. అది అతడికి తలకు మించిన భారం’ అని మాంటీ పనేసర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?