IndW Vs SLW: హర్మన్ ఒంటరి పోరాటం.. శ్రీలంక టార్గెట్ 176
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:49 PM
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ ఐదో టీ20లో తలపడతున్నాయి. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయిన టీమిండియా 175 పరుగులు చేసింది. లంక బ్యాటర్లకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ ఐదో టీ20లో తలపడతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి నాలుగు మ్యాచులు గెలిచి దూకుడు మీదున్న భారత అమ్మాయిలు.. ఈ టీ20లో కాస్త తడబడ్డారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(68) మినహా.. ఎవ్వరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయిన టీమిండియా 175 పరుగులు చేసింది. లంక బ్యాటర్లకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా బ్యాటర్లలో షెఫాలీ వర్మ(5), రిచా ఘోష్(5), దీప్తి శర్మ(7) దారుణంగా విఫలమయ్యారు. నేడే అరంగేట్రం చేసిన జి కమిలిని(12), రీ ఎంట్రీ ఇచ్చిన హర్లీన్ డియోల్(13), అమన్‌జోత్ కౌర్(21) పర్వాలేదనిపించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(68; 43 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సు) ఒంటరి పోరాటం చేయడంతోనే భారత్ ఈ స్కోరు సాధించగలిగింది. ఆఖరిలో అరుంధతీ రెడ్డి(27*) దూకుడు ప్రదర్శించింది. స్నేహ్ రాణా(8*) నాటౌట్‌గా నిలిచింది. లంక బౌలర్లలో చమరి ఆటపట్టు, రష్మిక సెవ్వండి, కవిషా దిల్హరి తలో రెండు, నిమిషా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా నాలుగు మ్యాచులు గెలిచి సిరీస్ ఇప్పటికే దక్కించుకుంది. ఈ ఐదో టీ20లో గెలిచి క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతుంది. అయితే స్మృతి మంధాన, జెమీమా లేని లోటు ఈ ఐదో టీ20లో కనిపించింది.
ఇవీ చదవండి:
సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!