Share News

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:55 PM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి ఖుషీ ముకర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. సూర్య తనకు పదే పదే మెసేజ్ చేసేవాడని తెలిపింది. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని వెల్లడించింది.

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై ఓ బాలీవుడ్ నటి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. తన బోల్డ్ లుక్స్‌తో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి, ‘ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా’ ఫేమ్ ఖుషీ ముకర్జీ(Khushi Mukherjee ).. సూర్యకుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.


ఖుషీ ఏమందంటే..?

‘గతంలో సూర్య(Suryakumar Yadav) నాకు తరచూ మెసేజ్ చేసేవాడు. ప్రస్తుతం మా ఇద్దరి మధ్య ఎలాంటి మాటలూ లేవు’ అని ఖుషీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఏ క్రికెటర్‌తో అయినా డేటింగ్ చేయాలనుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నా వెనక ఎంతో మంది పడుతున్నారు. కానీ నేను ఎవరితోనూ అసోసియేట్ అవ్వాలని అనుకోవడం లేదు. చిన్న విషయాలకే రూమర్స్ వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఎవ్వరితోనూ అంతగా మాట్లాడటం లేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


30-km.jpg

కాగా కోల్‌కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్‌ కూడా అయిన ఖుషి బాలీవుడ్‌ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్‌తో కలిసి హార్ట్‌ అటాక్‌.. ఆకాశ్‌తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేసింది.


సూర్య విషయానికొస్తే..

సూర్య నేతృత్వంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో సౌతాఫ్రికాపై 3-1తేడాతో గెలిచి సిరీస్ దక్కించుకుంది. త్వరలోనే న్యూజిలాండ్‌తో టీ20కి సిద్ధమవుతోంది. గత కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్య.. ఈ సిరీస్‌లో అయినా పుంజుకుంటాడో? లేదో? చూడాల్సి ఉంది.


ఇవీ చదవండి:

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో.. స్మృతి మంధాన చరిత్ర సృష్టిస్తుందా?

హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప

Updated Date - Dec 30 , 2025 | 04:55 PM