Harbhajan Singh: గిల్ టీ20 జట్టులోకి త్వరలోనే వస్తాడు: భజ్జీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:42 PM
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుండగా.. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే ప్రపంచ కప్ జట్టులో అనూహ్యంగా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన వైస్ కెప్టెన్సీతో పాటు, జట్టులో స్థానాన్నీ కోల్పోయాడు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గిల్ టీ20 మ్యాచుల్లో వరుసగా వైఫల్యమవుతున్నందున బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh ) ఈ విషయంపై స్పందించాడు.
‘టీమిండియాకు ఎంపిక విషయంలో తీవ్రమైన పోటీ ఉన్న విషయం వాస్తవమే. అయితే గిల్(Shubman Gill)కు దారులన్నీ మూసుకుపోయినట్లు కాదు. అతడు తిరిగి టీ20 జట్టులోకి వస్తాడు. శుభ్‌మన్ అద్భుతమైన ఆటగాడు. అతడు కచ్చితంగా పునరాగమనం చేస్తాడు. అలాగే గిల్ టెస్ట్ కెప్టెన్ అన్న విషయం మర్చిపోవద్దు. కాంబినేషన్ వల్ల గిల్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వివరణ ఇచ్చారు. పరిస్థితులు, కాంబినేషన్ వల్లే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. గిల్ ఒక క్లాస్ ప్లేయర్. అతడు జట్టులోకి తిరిగి వస్తాడన్న విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!