T20 WC 2026: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఐపీఎల్ రూ.13కోట్ల స్టార్‌కు దక్కని చోటు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:08 PM
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇంగ్లండ్ జట్టును తాజాగా ప్రకటించారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత త్వరలోనే టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే టీమిండియా తమ జట్టును ప్రకటించింది. కాగా తాజాగా ఇంగ్లండ్ 15 మందితో కూడిన ప్రొవిజనల్ జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్‌లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone)కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. వికెట్‌కీపర్, బ్యాటర్ జేమీ స్మిత్‌కు కూడా ఇంగ్లిష్ జట్టు సెలక్టర్లు మొండిచేయి చూపారు.
గాయం కారణంగా యాషెస్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచులకు దూరమైన జోఫ్రా ఆర్చర్‌ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నారు. అయితే, వరల్డ్ కప్ కంటే ముందు శ్రీలంకతో ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లన్నింటికీ ఆర్చర్ దూరంగా ఉంటాడు. టెస్టు ఫాస్ట్‌బౌలర్ జోష్ టంగ్ తొలిసారి టీ20లకు ఎంపికయ్యాడు. ఇతను లంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌తోపాటు టీ20 ప్రపంకప్ జట్టు (T20 World Cup 2026)లో ఉన్నాడు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇంగ్లాండ్ గ్రూప్ దశలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీతో తలపడనుంది.
2026 T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, విల్ జాక్స్, జేమీ ఒవర్టన్, సామ్ కరన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, అదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
ఇవీ చదవండి:
సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!