IndW Vs SLW: బాదేశారంతే.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ABN , Publish Date - Dec 23 , 2025 | 09:50 PM
విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 11.5 ఓవర్లలోనే ఆటను ముగించింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత మహిళలు అదరగొట్టారు. 129 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకతపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో లంకపై భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.
షెఫాలీ వర్మ(69*) అద్భుత ప్రదర్శనతో హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచింది. రిచా ఘోష్(1*), హర్మన్ ప్రీత్ సింగ్() స్మృతి మంధాన(14), జెమీమా రోడ్రిగ్స్(26) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో మాల్కి మదర, కవింది, కవిశా దిల్హరి తలో వికెట్ పడగొట్టారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంక బ్యాటర్లు ఆది నుంచే తడబడుతూనే వచ్చారు. తొలి టీ20 మాదిరిగానే.. ఈ మ్యాచులోనే స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేశారు. టీమిండియాకు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
విష్ని గుణరత్నే(1), హాసిని పెరెరా(22), కవిఖా దిల్హారి(14), నిలాక్షి డిసెల్వా(2), కౌశని నుత్యాంగణ(11), షాషని గింహాని(0), కాయా కవింది(1) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. చిమరి ఆటపట్టు(31), హర్షిత సమరవిక్రమ(33) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అరంగేట్ర మ్యాచులోనే వైష్ణవి శర్మ అదరగొట్టింది. వైష్ణవి శర్మ, శ్రీ చరణి తలో రెండు, క్రాంతి గౌడ్, అరుంధతీ రెడ్డి చెరొక వికెట్ పడగొట్టారు. గత మ్యాచులాగే ఇందులోనూ మూడు రనౌట్లు ఉండటం గమనార్హం.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు