Share News

Virat Kohli: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న కోహ్లీ..

ABN , Publish Date - Feb 19 , 2025 | 07:46 PM

IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తమకు చాలా సెంటిమెంట్ అని అన్నాడు. అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న కోహ్లీ..
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఊరిస్తూ వచ్చిన మెగా టోర్నీ ఎట్టకేలకు స్టార్ట్ అయిపోయింది. ఆతిథ్య పాకిస్థాన్, డేంజరస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి పోరుతో మెగా టోర్నీ మొదలైపోయింది. ఈ తరుణంలో భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ క్రీడా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఓ సెంటిమెంట్ తమకు కలిసొస్తుందన్నాడు. బంగ్లాదేశ్‌తో ఐసీసీ టోర్నీల్లో తొలి మ్యాచ్‌లో ఆడటం మంచి విషమన్నాడు. అతడు ఇలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..


ఒత్తిడి అంటే ఇష్టం!

వన్డే ప్రపంచ కప్-2011లో భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. అదే ఊపులో ఒక్కో టీమ్‌ను ఓడిస్తూ చివరకు కప్ ఎగరేసుకుపోయింది. అందుకే తాజా చాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడటం సెంటిమెంట్‌గా భావిస్తున్నానని అన్నాడు విరాట్. చాంపియన్స్ ట్రోఫీ కూడా టీ20 వరల్డ్ కప్‌లాగే అనిపిస్తోందన్నాడు. మూడ్నాలుగు మ్యాచులతో సెమీస్ ఎవరు చేరతారనేది డిసైడ్ చేస్తారు కాబట్టి ఈ టోర్నీలో ప్రతి జట్టు మీద తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నాడు కింగ్. తనకు ప్రెజర్ అంటే ఇష్టమని.. ఇలాంటి సందర్భాల్లోనే బెస్ట్ గేమ్ బయటకు వస్తుందని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, తొలి మ్యాచ్‌లో బంగ్లాతో తలపడనున్న రోహిత్ సేన.. మలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ తన బెస్ట్ ఇస్తాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా

అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..

కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 07:55 PM