Rohit vs Gambhir: రోహిత్ యూ టర్న్.. కన్‌ఫ్యూజన్‌లో గంభీర్.. ఇదేం ట్విస్ట్
ABN , Publish Date - Jan 12 , 2025 | 02:29 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్‌లో భారత్‌ను గెలిపించడమే గాక స్వీయ ఫామ్‌ను మెరుగుపర్చుకోవడం మీదా దృష్టి పెడుతున్నాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇటీవల కాలంలో భారత క్రికెట్‌కు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నలిగిన అంశం ఇది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్‌లో హిట్‌మ్యాన్ బరిలోకి దిగకపోవడం, రెస్ట్ పేరుతో బెంచ్‌కే పరిమితం కావడం తెలిసిందే. అతడు కావాలనే విశ్రాంతి తీసుకున్నాడా? వరుస వైఫల్యాల్లో ఉన్నాడనే కారణంతో టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టిందా? అనేది క్లారిటీ రాలేదు. ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ సిడ్నీ టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా మాట్లాడుతూ తాను ఆటకు వీడ్కోలు చెప్పడం లేదని స్పష్టం చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ తర్వాతే రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నా.. ఆప్తులు, శ్రేయోభిలాషుల సూచనలతో వెనకడుగు వేశాడని వినిపిస్తోంది. అయితే ఇది హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు నచ్చలేదని తెలుస్తోంది.
మాట మార్చడం ఏంటి?
బీజీటీలో మూడు టెస్టుల్లో కలిపి 31 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ రిటైర్మెంట్ మీద యూ టర్న్ తీసుకోవడం గంభీర్‌కు నచ్చలేదట. ఇది అతడ్ని అసంతృప్తికి గురి చేసిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. పదే పదే ఫెయిల్ అవుతున్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ పైనా గౌతీ అసహనం వ్యక్తం చేశాడని సమాచారం. ముఖ్యంగా రోహిత్ రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చి మాట మార్చడంతో గంభీర్ కన్‌ఫ్యూజ్ అయ్యాడని.. అతడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడని వినికిడి. అయితే సీనియర్లు గనుక ఏమీ అనలేక ఊరుకున్నాడట.
రూల్ అంటే రూలే!
బీసీసీఐ శనివారం నాడు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజీటీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించింది. ఇందులో కోహ్లీ, రోహిత్ డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోవడం మీదా డిస్కస్ చేసినట్లు సమాచారం. గంభీర్ కోచ్‌గా వచ్చాక వరుసగా రెండు టెస్ట్ సిరీస్‌ల్లో భారత్ ఓడిపోవడం మీదా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బోర్డుకు అంతా ఒకటేనని.. రూల్ అంటే రూలేనని.. ప్రతి ప్లేయర్ దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలెక్షన్ కమిటీ వెల్లడించినట్లు వినిపిస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లకు ఫిజియో నుంచి పర్మిషన్ వస్తేనే మినహాయింపు ఇస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
ప్లీజ్.. ఇంకో చాన్స్ ఇవ్వండి.. ఐసీసీకి బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది
చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి