Share News

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు

ABN , Publish Date - Feb 10 , 2025 | 09:50 AM

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో ఏకైక బ్యాటర్‌గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. మరి.. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది దొరికేసింది. బరిలోకి దిగి ప్రత్యర్థులను అతడు ఊచకోత కోస్తుంటే చూసి ఆనందించాలని ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ లవర్స్ కోరుకున్నారు. కానీ చాన్నాళ్లుగా అది అందని ద్రాక్షగా మారింది. బ్యాటింగ్ వైఫల్యంతో బాధపడుతున్న హిట్‌మ్యాన్.. దాని వల్ల కెప్టెన్సీలోనూ తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేక ఇబ్బందులు పడ్డాడు. అయితే మొత్తానికి దాన్ని దాటేశాడు. రియల్ హిట్‌మ్యాన్ ఎలా ఉంటాడో మరోమారు పరిచయం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో 90 బంతుల్లో 12 బౌండరీలు, 7 భారీ సిక్సులతో 119 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడు చరిత్ర సృష్టించాడు.


ఇక వేటే!

రోహిత్ బ్యాట్ సరైన సమయంలో గర్జించింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్న వేళ ఇంగ్లండ్‌పై సంచలన సెంచరీతో చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని పలు రికార్డులకు పాతర వేశాడు హిట్‌మ్యాన్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 30 ఏళ్ల వయసు దాటాక అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో ఒకే ఒక్కడిగా నిలిచాడు భారత సారథి.


టాప్‌లో హిట్‌మ్యాన్!

30 ఏళ్లు దాటాక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (36 సెంచరీలు) టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. 2017లో 30వ పడిలోకి అడుగుపెట్టిన ఈ విధ్వంసక బ్యాటర్.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 36 సెంచరీలు బాదేశాడు. ఇందులో వన్డేల్లో 22 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో 5 సెంచరీలు ఉన్నాయి. మిగతావి లాంగ్ ఫార్మాట్‌లో కొట్టాడు. 30 ఏళ్ల వయసు దాటాక అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్లలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ (35 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ ద్రవిడ్ (26 సెంచరీలు), విరాట్ కోహ్లీ (18 సెంచరీలు), సునీల్ గవాస్కర్ (16 సెంచరీలు) ఉన్నారు.


ఇవీ చదవండి:

అంతుపట్టని సమస్యకు పిండం పెట్టిన రోహిత్

జ్యోతి హ్యాట్రిక్‌ పసిడి

‘రెండు’కు ఆస్ట్రేలియా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2025 | 10:00 AM