Rohit-Rahul: రోహిత్ చెప్పిందే చేస్తున్నా.. అయినా పట్టించుకోట్లేదు: రాహుల్
ABN , Publish Date - Mar 06 , 2025 | 03:05 PM
ICC Champions Trophy 2025: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జోరు మీదున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అటు కీపింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ భారత విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాంటోడు సారథి రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆఖరి దశలో ఈ వికెట్ కీపర్, బ్యాటర్ ఫామ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ ఫైట్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక ఎండ్‌లో బౌండరీలు, సిక్సులతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన రాహుల్.. మరో ఎండ్‌లో ఉన్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద ఉన్న ప్రెజర్‌ను తీసేశాడు. టీమ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్‌తో పాటు వన్డేల భవిష్యత్తు, చాంపియన్స్ ట్రోఫీ.. తదితర విషయాలపై అతడు రియాక్ట్ అయ్యాడు. హిట్‌మ్యాన్ మాట వింటున్నా తనను పట్టించుకోవట్లేదని అన్నాడు.
అదే ముఖ్యం
గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో 5వ స్థానంలో ఆడుతూ వచ్చానని.. కానీ ఇప్పుడు తనను కింద ఆడిస్తున్నారని రాహుల్ అన్నాడు. టీమ్ గెలుపు కోసం కెప్టెన్ రోహిత్ ఏం చెబితే అదే చేస్తున్నానని తెలిపాడు. అయితే తాను ఎక్కడ బ్యాటింగ్ చేస్తున్నాననేది చాలా మంది మర్చిపోతున్నారని చెప్పాడు. తన పెర్ఫార్మెన్స్‌ను పట్టించుకోవడం లేదని, తగిన గుర్తింపు దక్కడం లేదని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. టీమ్ గెలుపు కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు.
ఏ చాలెంజ్‌కైనా రెడీ
2020 నుంచి వన్డే టీమ్‌లో తాను ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ వచ్చానని రాహుల్ చెప్పుకొచ్చాడు. కానీ తాను ఏ స్థానంలో ఆడతాననేది చాలా మంది మర్చిపోయారని వాపోయాడు. వన్డే సిరీస్‌లు తరచూ జరగకపోవడంతో ఏదైనా ఒక సిరీస్‌లో తాను రాణించినా ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదన్నాడు. వన్డే సిరీస్‌లకు మధ్య 4-5 నెలల గ్యాప్ వస్తుండటంతో తదుపరి సిరీస్‌లో ఏ ప్లేస్‌లో ఆడించాలి.. ఎక్కడ ఆడితే టీమ్‌కు బెటర్.. లాంటి విషయాలపై టీమ్ మేనేజ్‌మెంట్ పునరాలోచన చేస్తుందన్నాడు. అయితే ఎక్కడ ఆడమన్నా, ఏ రోల్ ఇచ్చినా 100 శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. రోహిత్ చెప్పిన పని చేస్తానని.. అతడి నుంచి ఎంతో నేర్చుకున్నానని కేఎల్ పేర్కొన్నాడు. అతడు తనను చాలా సపోర్ట్ చేస్తాడని వ్యాఖ్యానించాడు. ఎప్పుడూ తనకు అండగా ఉండి.. టీమ్‌లో చోటుపై భరోసా ఇస్తాడని వివరించాడు రాహుల్.
ఇవీ చదవండి:
19 ఏళ్ల కెరీర్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి