Share News

వన్డేలకు స్మిత్‌ వీడ్కోలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:33 AM

ఆస్ట్రేలియా తాత్కాలిక సారథి స్టీవెన్‌ స్మిత్‌ వన్డే క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్‌ చేతిలో ఆసీస్‌ నాలుగు వికెట్లతో...

వన్డేలకు స్మిత్‌ వీడ్కోలు

దుబాయ్‌: ఆస్ట్రేలియా తాత్కాలిక సారథి స్టీవెన్‌ స్మిత్‌ వన్డే క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్‌ చేతిలో ఆసీస్‌ నాలుగు వికెట్లతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని స్మిత్‌ నిర్ణయించుకున్నాడు. అయితే 35 ఏళ్ల స్టీవ్‌.. టెస్ట్‌లు, టీ20లలో కొనసాగనున్నట్టు తెలిపాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయంతో వైదొలగడంతో చాంపియన్స్‌ ట్రోఫీలో స్మిత్‌ సారథ్యం వహించాడు. మంగళవారం టీమిండియాతో మ్యాచ్‌ ముగియగానే..తన రిటైర్మెంట్‌ విషయాన్ని సహచరులకు స్మిత్‌ తెలిపాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్‌ కప్‌లు సాధించడంలో స్మిత్‌ది కీలక భూమిక. 2015, 2021లో ‘ఆస్ట్రేలియా పురుషుల వన్డే ఆటగాడు’ అవార్డులు అందుకున్నాడు. 2015లో ‘ఐసీసీ వన్డే పురుషుల జట్టు’లో స్టీవ్‌కు చోటు దక్కింది. 2015లో ఆసీస్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మొత్తం 64 వన్డేల్లో స్మిత్‌ సారథ్యం వహించాడు. ‘2027 వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకాలు ప్రారంభించాల్సిన తరుణం ఆసన్నమైంది.


అందువల్ల నేను వైదొలగేందుకు ఇదే సరైన సమయమని భావించా’ అని స్మిత్‌ చెప్పాడు. జూన్‌లో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పలో ఆడేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. 2010లో లెగ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా వెస్టిండీ్‌సపై స్మిత్‌ వన్డే అరంగేట్రం చేశాడు. ఏళ్లుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు స్మిత్‌ వెన్నుముకగా నిలిచాడు.

వన్డే కెరీర్‌ ఇలా..

మ్యాచ్‌లు 170

ఇన్నింగ్స్‌ 154

పరుగులు 5800

అత్యధికస్కోరు 164

సగటు 43.28

శతకాలు 12

అర్ధ శతకాలు 35

వికెట్లు 28


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2025 | 04:33 AM