KL Rahul-Gautam Gambhir: రాహుల్ కెరీర్‌తో ఆడుకుంటున్న గంభీర్.. రోహిత్‌కు తెలిసే జరుగుతోందా..
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:17 PM
IND vs ENG: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అతడితో టీమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా కోచ్ గౌతం గంభీర్ ఆటాడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి సంధించిన 248 పరుగుల లక్ష్యాన్ని 68 బంతులు ఉండగానే ఛేదించింది. శుబ్‌మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో బట్లర్ సేనను కుమ్మేశారు. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లతో మెరిశారు. ఇతర బౌలర్లు కూడా వికెట్లు తీస్తూ ఎకనామికల్‌గా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌తో చాలా సమస్యలకు చెక్ పెట్టింది టీమిండియా. అయితే ఇదే తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. అతడిపై కావాలనే కుట్ర చేస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.
కాంబినేషన్ మాయలో..
భారత జట్టులో ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్‌కు దిగి పరుగులు చేసే సత్తా ఉన్న ఏకైక ప్లేయర్‌గా కేఎల్ రాహుల్‌కు మంచి పేరుంది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్ వరకు చాలా స్థానాల్లో ఆడుతూ వస్తున్నాడతను. టీమ్ అవసరాన్ని బట్టి ఏం చేయడానికైనా అతడు వెనుకాడట్లేదు. అయితే దీని వల్ల ఓ బ్యాటింగ్ పొజిషన్ అనేది అతడికి లేకుండా పోయింది. అతడు బాగా రాణించిన 5వ పొజిషన్ గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో రాహుల్ తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నాడు. నాగ్‌పూర్ వన్డేలో అయ్యర్ ఔట్ అయ్యాక రాహుల్‌ను కాదని.. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలనే కారణంతో అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపింది టీమ్ మేనేజ్‌మెంట్.
రాహుల్ కంటే తోపా?
ఆఖర్లో అక్షర్ ఔట్ అయ్యాక బరిలోకి దిగాడు రాహుల్. చేయాల్సిన పరుగులు తక్కువే ఉన్నా.. తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చారనే బాధో లేదా నిరుత్సాహమో తెలియదు క్రీజులో చాలా అన్‌కంఫర్టబుల్‌గా కనిపించాడు. 2 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. 2022 నుంచి ఇప్పటివరకు జరిగిన వన్డేల్లో మిడిలార్డర్‌లో దిగి ఎక్కువ పరుగులు చేసిన వారి లిస్ట్‌లో రాహుల్ (30 మ్యాచుల్లో 1,235 పరుగులు) ఉన్నాడు. అలాంటోడ్ని పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం కరెక్ట్ కాదని వినిపిస్తోంది. కోచ్ గంభీర్ కావాలనే కుట్ర పన్నుతున్నాడని.. అతడికి బదులు ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ జోక్యం!
రాహుల్ సీనియర్ బ్యాటర్ అని.. టీమిండియా మిడిలార్డర్‌కు అతడు చాలా కీలకమని అంటున్నారు. అతడు ఫామ్‌ను అందుకోవడం, కాన్ఫిడెన్స్‌తో ఉండటం చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఎంకరేజ్‌మెంట్ లేకపోవడంతో రాహుల్ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదని.. అతడు డల్‌గా కనిపిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సారథి రోహిత్‌కు తెలిసే ఇది జరుగుతోందా.. ఇందులో హిట్‌మ్యాన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి:
గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి
క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..
ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి