Share News

Team India: టీమిండియా నయా కోచ్‌గా ఇంగ్లండ్ లెజెండ్.. ఇక రోహిత్-కోహ్లీకి తిరుగుండదు

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:39 PM

BCCI: వరుస వైఫల్యాలతో సతమతం అవుతోంది టీమిండియా. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడం, ఆస్ట్రేలియా టూర్‌లోనూ చిత్తవడంతో ఇంటా బయట భారత్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. దీంతో కోచింగ్ స్టాఫ్‌ను మార్చాలని చూస్తోంది బీసీసీఐ.

Team India: టీమిండియా నయా కోచ్‌గా ఇంగ్లండ్ లెజెండ్.. ఇక రోహిత్-కోహ్లీకి తిరుగుండదు
Team India

వరుస వైఫల్యాలతో సతమతం అవుతోంది టీమిండియా. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడం, ఆస్ట్రేలియా టూర్‌లోనూ చిత్తవడంతో ఇంటా బయట భారత్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. దీంతో కోచింగ్ స్టాఫ్‌ను మార్చాలని చూస్తోంది బీసీసీఐ. ముఖ్యంగా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ పనితీరుపై బోర్డు పెద్దలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జనవరి 11న జరిగిన ఏజీఎం మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించారని.. కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు కంపల్సరీ అని సమాచారం. కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఓ ఇంగ్లండ్ లెజెండ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఎవరా దిగ్గజం అనేది ఇప్పుడు చూద్దాం..


సరైనోడ్ని దింపుతున్నారు!

కివీస్, ఆసీస్ సిరీస్‌ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ అయితే ఒకే మాదిరిగా వరుసగా 8 ఇన్నింగ్స్‌లో ఔట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ ఆవలి బంతుల్ని గెలికి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడితో పాటు ఇతర బ్యాటర్ల టెక్నిక్‌ను సరిజేయడంలో కోచింగ్ స్టాఫ్ నిర్లక్ష్యంపై బోర్డు పెద్దలు గుస్సా అయ్యారట. బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌ను తీసేయాలనే ఆలోచనలు కూడా చేశారట. అయితే నెగెటివిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో అతడ్ని కొనసాగిస్తూనే.. అదనంగా ఇంకో బ్యాటింగ్ కోచ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఆ స్థానం కోసం ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ సరైనోడని అనుకుంటున్నారని సమాచారం.


డామినేషన్‌కు చెక్!

టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా పీటర్సన్ నియామకం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. అతడి ఎంపికపై బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ విరాట్ కోహ్లీ కూడా ఈ నియామకంపై సంతోషంగా ఉన్నారని సమాచారం. టీమ్‌ మీద హెడ్ కోచ్ గౌతం గంభీర్ డామినేషన్ ఎక్కువైందని, సీనియర్లకు అతడికి పొసగట్లేదంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పీటర్సన్ రాకతో జట్టుపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చూడాలి. అతడి వల్ల రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు రావడం ఖాయమని.. ఇక వాళ్లకు తిరుగులేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

స్టార్ క్రికెటర్‌తో సెల్ఫీ కోసం పరిగెత్తాడు.. తీరా వచ్చి చూస్తే..

రోహిత్-కోహ్లీపై బ్యాన్.. స్టార్లకు ఉచ్చు బిగిస్తున్న బీసీసీఐ

టీమిండియాలో వణుకు.. డేంజర్ రూల్‌ను మళ్లీ తీసుకొస్తున్న బీసీసీఐ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2025 | 03:44 PM