Shreyas Iyer: అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు.. ఇది అస్సలు ఊహించలేదు గురూ
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:59 PM
IND vs NZ: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అవకాశం వచ్చిన ప్రతిసారి అతడు అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లోనూ కఠిన దశలో క్రీజులోకి అడుగుపెట్టిన అయ్యర్.. ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. హాఫ్ సెంచరీతో టీమ్‌ను కష్టాల కడలిలో నుంచి బయటపడేశాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక బ్యాట్ పైకి లేపి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే దాని మీద ఓ రాక్షసుడి పేరు ఉండటంతో డిస్కషన్స్ మొదలయ్యాయి. మరి.. శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌పై ఎవరి పేరు ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆ పేరు ఎవరిది..
అయ్యర్ బ్యాట్ మీద ఉన్న ఆ పేరు మరెవరిదో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మదే కావడం విశేషం. శ్రేయస్ బ్యాట్ హ్యాండిల్‌కు కింద స్పాన్సర్ కంపెనీ పేరు ఉంది. దాని పక్కన ‘హిట్‌మ్యాన్’ అని రాసి ఉంది. ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఈ పేరు ఒక్కసారిగా కెమెరాల కంటికి చిక్కడంతో వైరల్ అవుతోంది. బౌలర్ ఎవరు? పిచ్ ఎలా ఉంది? కండీషన్స్ ఏంటి? అనేది పట్టించుకోకుండా బౌండరీలు, సిక్సులతో ఊచకోత కోస్తాడు కాబట్టి రోహిత్‌ను అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. ఇప్పుడే అదే పేరును తన బ్యాట్ మీద ప్రదర్శించడం ద్వారా సారథి, అతడి బ్యాటింగ్ అంటే తనకు ఎంత ఇష్టమో అయ్యర్ చూపించాడు. హిట్‌మ్యాన్ కోసం తాను ఎప్పుడైనా, ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పకనే చెప్పాడు స్టైలిష్ బ్యాటర్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి