AUS vs SA: ఇంగ్లండ్‌ను వదలని శని.. ఇక తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే
ABN , Publish Date - Feb 25 , 2025 | 07:31 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్‌లపై సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి. కానీ గ్రూప్-బీ టీమ్స్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదకరంగా చెప్పుకున్న ఆతిథ్య పాకిస్థాన్ 5 రోజులకే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది పాక్. దీంతో గ్రూప్-ఏ నుంచి కివీస్, టీమిండియా సెమీస్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే మిగిలిన రెండు నాకౌట్ బెర్త్‌లపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ దీని మీద క్లారిటీ వస్తుందేమో అనుకుంటే అది కుదరలేదు.
వరుణుడు అడ్డుపడటంతో..
గ్రూప్-బీ జట్లయిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ను అంపైర్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ చెరో 3 పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ప్రొటీస్ టాప్‌లో ఉంది. అయితే ఈ మ్యాచ్ వర్షార్పణం కావడం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో చావుదెబ్బ తిన్న బట్లర్ సేన.. తాజా ఫలితంతో తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
మర్చిపోని గాయం
మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్.. సెమీస్‌కు వెళ్లాలంటే తదుపరి ఆఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికాతో మ్యాచుల్లో తప్పక గెలవాలి. వన్డే వరల్డ్ కప్-2023లో ఆఫ్ఘాన్ చేతుల్లో ఇంగ్లండ్ ఓడిన సంగతి ఇంకా ఫ్యాన్స్ మర్చిపోలేదు. అటు ప్రొటీస్ వరుస విజయాలతో జోష్‌లో ఉంది. అలాంటి టీమ్స్‌ను బ్యాక్ టు బ్యాక్ ఓడించడం బట్లర్ బృందానికి తలకు మించిన పనే. ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సిందే. ఒకవేళ ఆసీస్‌తో మ్యాచ్ జరిగి.. అందులో ఓడితే సౌతాఫ్రికా మానసికంగా బలహీనపడేది. అప్పుడు ఇంగ్లండ్‌కు ఆ జట్టును ఓడించే అవకాశాలు మెరుగయ్యేవి. కానీ ఇవేవీ జరగలేదు. వరుణుడు అడ్డుపడటంతో సెమీస్ బెర్త్‌లపై ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.
ఇవీ చదవండి:
టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ
భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..
భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి