Share News

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతో తెలుసా..

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:12 PM

ఇంకొన్ని రోజుల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ తాజాగా రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది. అయితే ఎంత ప్రకటించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతో తెలుసా..
Champions Trophy 2025

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2017లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పుడు మరోసారి ఈ టోర్నమెంట్ జరగబోతుంది. ఈసారి ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ టోర్నమెంట్ పాకిస్తాన్‌లో నిర్వహించబడనుంది. ఇది పాకిస్తాన్‌కు మొదటిసారి ఆతిథ్యం కావడం విశేషం. ఈ క్రమంలో ICC.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారీగా ప్రైజ్ మనీని పెంచింది. ICC ప్రకటన ప్రకారం 2017లో జరిగిన టోర్నమెంట్‌తో పోల్చుకుంటే ఈసారి ప్రైజ్ మనీ 53 శాతం పెరిగింది. ఈ ఏడాది టోర్నమెంట్ గెలిచే జట్టుకు దాదాపు రూ. 19.50 కోట్లు లభిస్తాయని ఐసీసీ తెలిపింది.


ప్రైజ్ మనీ వివరాలు..

2025 ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి అంచనా వేయబడిన ప్రైజ్ మనీ 6.9 మిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే మొత్తంగా దాదాపు రూ. 60 కోట్లని అర్థం. ఫైనల్లో పరాజయం ఎదుర్కొన్న జట్టు కూడా భారీ మొత్తాన్ని అందుకుంటుంది. అంటే రన్నరప్ జట్టు సుమారు 10 కోట్ల రూపాయలు దక్కించుకుంటుంది. అలాగే సెమీ-ఫైనల్స్ నుంచి నిష్క్రమించే జట్లకు సుమారు రూ. 5 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు.


గ్రూప్ దశలో జట్లకు ఇచ్చే బహుమతి..

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి 8 జట్లు 2 గ్రూపుల్లో (ప్రతి గ్రూపులో 4 జట్లు) పాల్గొంటాయి. ఇందులో ప్రతి జట్టు కనీసం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. గ్రూప్ దశలో విజయవంతంగా గెలిచే జట్టు ప్రతీ మ్యాచ్‌కు దాదాపు రూ. 30 లక్షల ప్రైజ్ మనీని పొందుతుంది. ఈ నేపథ్యంలో ఐదు, ఆరో స్థానంలో నిలిచే జట్లు కూడా దాదాపు రూ. 3 కోట్ల ప్రైజ్ మనీని పొందుతాయి. అదే సమయంలో ఏడు, 8వ స్థానంలో నిలిచే జట్లకు సుమారు రూ. 1.21 కోట్లు బహుమతిగా ఇస్తారు. అలా ప్రతి జట్టు కనీసం 1 కోటి రూపాయలు ఖచ్చితంగా పొందుతుందని చెప్పవచ్చు.


ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ వివరాలు..

  • ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే జట్టుకు : రూ. 19.45 కోట్లు

  • ఛాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ జట్టుకు : రూ. 9.73 కోట్లు

  • సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించే జట్లకు : రూ. 4.86 కోట్లు

  • ఐదు, 6వ స్థానంలో నిలిచే జట్లకు : రూ. 3.04 కోట్లు

  • ఏడు, 8వ స్థానంలో నిలిచే జట్లకు : రూ. 1.21 కోట్లు

  • గ్రూప్ దశలో ప్రతి విజయానికి : రూ. 29.5 లక్షలు

  • టోర్నమెంట్‌లో పాల్గొనటానికి (ప్రతి జట్టుకు): రూ. 1.08 కోట్లు


పాకిస్తాన్ ఆతిథ్యంగా..

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఈసారి తొలి సారి ICC ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం ఇవ్వబోతుంది. 2017లో ఈ టోర్నమెంట్ జరిగిన తర్వాత, మళ్లీ ఐసీసీ ఈ విభిన్నమైన టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్‌ గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్


OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..


Stock Market: మోదీ, ట్రంప్ భేటీ వేళ.. స్టాక్ మార్కెట్లు తీరు ఎలా ఉందంటే..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:20 PM