Share News

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:40 PM

వయాకామ్ 18, స్టార్ ఇండియా నేతృత్వంలో ఏర్పడిన జియోస్టార్ కొత్తగా OTT ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి వినియోగదారులకు సరికొత్త వినోద అనుభవాన్ని అందించనుంది.

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్
Jiohotstar OTT Launch

ఎంటర్ టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి మరో కీలక ఓటీటీ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్‌ (Jiohotstar) అడుగుపెట్టింది. ఈ క్రమంలో యూజర్లకు మూడు లక్షల గంటలకుపైగా వినోద కంటెంట్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ ప్లాట్‌ఫామ్ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి వినోదప్రియులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ఇందులో ప్రత్యక్ష క్రీడా కవరేజి కూడా ఉంటుంది. తద్వారా ఈ ప్లాట్‌ఫామ్ 50 కోట్లకి పైగా వినియోగదారులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వయాకామ్ 18, స్టార్ ఇండియా మధ్య ఏర్పడిన జాయింట్ వెంచర్ ద్వారా జియోస్టార్ తన కొత్త OTT ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్‌ను ప్రారంభించింది.


ఇష్టమైన షోలు..

దీని ప్రారంభం సందర్భంగా జియో హాట్‌స్టార్ ప్లాట్ ఫాం ప్రతి భారతీయుడికి ప్రీమియం వినోదాన్ని అందించే లక్ష్యంతో రూపొందించబడిందని జియోస్టార్ డిజిటల్ సీఈఓ కిరణ్ మణి అన్నారు. ఈ క్రమంలో వినోదాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తామన్నారు. ఈ క్రమంలో AI ఆధారిత సిఫార్సులు, 19 భాషలకుపైగా స్ట్రీమింగ్‌ను అందిస్తూ, కంటెంట్‌ను మరింత వినూత్నంగా అందిస్తామని చెప్పారు. జియోహాట్‌స్టార్ కొత్తదనం ఏమిటంటే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు తమ ఇష్టమైన షోలు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా చూసే అవకాశం ఉంటుంది.


సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్

ఈ క్రమంలో అంతరాయాల్లేకుండా వీక్షకుల కోసం JioHotstar వివిధ అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయమైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇవి రూ. 149 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జియో సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు తమ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫాంకు మార్చుకోవచ్చు. జియోహాట్‌స్టార్ మరో ప్రత్యేకత ‘స్పార్క్స్’ అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం. ఇందులో కొత్త, వినూత్న కంటెంట్ ఫార్మాట్లు ఉన్నాయి.


లక్షలాది మందిని..

భారతదేశంలో క్రీడలు కేవలం ఒక ఆట కాదని, జియోస్టార్ స్పోర్ట్స్ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు. ఈ క్రమంలో లక్షలాది మందిని కలిపే ఈ అనుభవాన్ని మరింత సాంకేతికంగా మార్చి, వినియోగదారులకు సులభంగా అందించేందుకు JioHotstar కట్టుబడి ఉందన్నారు. జియో హాట్‌స్టార్ ద్వారా ICC టోర్నమెంట్లు, IPL, WPL, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, BCCI, ICC, రాష్ట్ర స్థాయి ఈవెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

క్రీడా ప్రియులు ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ, ISL వంటి ప్రపంచ స్థాయి పోటీలను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. JioHotstar కేవలం వినోదం మాత్రమే కాకుండా, బ్రాండ్‌లు, ప్రకటనదారులకు అపారమైన అవకాశాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ భారీగా ప్రేక్షకులను కల్గి ఉన్న నేపథ్యంలో అధునాతన ప్రకటన ఫార్మాట్‌లు, డేటా ఆధారిత వ్యక్తిగతీకరణ వ్యాపారాలు తమ వినియోగదారులతో మరింత కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది.


ఇవి కూడా చదవండి:

OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..


Stock Market: మోదీ, ట్రంప్ భేటీ వేళ.. స్టాక్ మార్కెట్లు తీరు ఎలా ఉందంటే..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:07 PM