OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:45 AM
ఇక భారత్ కూడా డేటా సెంటర్‌లకు కేంద్రంగా మారనుంది. ఎందుకంటే ఓపెన్‌ఏఐ త్వరలో భారతదేశంలో డేటా సెంటర్‌లను స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చాట్ జీపీటీ (ChatGPT) తయారీ సంస్థ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల భారతదేశంలోని వినియోగదారులతో పాటు, దీని పొరుగు దేశాల కోసం కూడా డేటా స్టోర్ చేసుకునే సౌకర్యం ఉంటుందని భావిస్తోంది. ఓపెన్‌ఏఐ, తన కృత్రిమ మేధస్సు (AI) టూల్స్, సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని డేటా సెంటర్‌ల స్థాపనపై ఫోకస్ చేసిందని నిపుణులు అంటున్నారు.
పూర్తి కావాలంటే
దీనిని నిర్వహించడానికి భారతదేశ మార్కెట్ అనువుగా ఉంటుందని, అందుకే పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం ప్రకారం ప్రస్తుతం ఓపెన్‌ఏఐ కొన్ని డేటా సెంటర్ ఆపరేటర్లతో సంబంధాలు ఏర్పరచుకుంటుందని తెలిసింది. అయితే ఈ ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు ఆయా వర్గాలు చెప్తున్నాయి. ఇది పూర్తి కావాలంటే ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. డేటా సెంటర్‌లు వినియోగదారుల డేటాను సురక్షితంగా నిల్వ, ప్రాసెస్ చేయడం వంటి పలు రకాల మౌలిక సదుపాయాలను నిర్వహిస్తాయి. ఈ క్రమంలో ఓపెన్‌ఏఐ తన నూతన ప్రణాళికల్లో భారతీయ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి స్థానిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు
ఓపెన్‌ఏఐ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కృత్రిమ మేధస్సు (AI) సంస్థగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో చాట్‌జీపీటీ ఇతర AI సాధనాలతో పోటీ పడి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ AI ఆధారిత అనేక టూల్స్ వినియోగదారులకు సహాయపడటానికి, వినియోగాన్ని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని ఎక్కువగా ఎడ్యుకేషన్, ఆరోగ్య సంరక్షణ, రిటైల్, ఫైనాన్స్ వంటి రంగాలలో ఉపయోగిస్తున్నారు. దీంతో ఇండియాలో ఈ AI ఆధారిత సాధనాలకు డిమాండ్ క్రమంగా పెరిగింది.
ప్రాథమిక అవసరాలు
2019లో భారత ప్రభుత్వం "డిజిటల్ ఇండియా" నినాదంతో అనేక రకాల సేవలు అందించడానికి సిద్ధమైంది. అయితే ఈ రంగంలో అభివృద్ధి క్రమంగా జరుగుతున్నప్పటికీ, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు, దేశీయ సమాచార నిబంధనల అమలు వంటి అంశాలు ఓపెన్‌ఏఐకి సవాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో డేటా సెంటర్‌లు ఏర్పాటు చేయడానికి అవసరాలు పెరిగాయని చెబుతున్నారు నిపుణులు. ఇండియాలో కూడా ప్రధాన డేటా సెంటర్ కేంద్రాలు పనిచేసేందుకు 2022లో ప్రభుత్వం కొత్త "డేటా ప్రైవసీ బిల్లును" ప్రవేశపెట్టింది. ఈ డేటా సెంటర్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో ఓపెన్‌ఏఐ, పలు డేటా సెంటర్ కంపెనీలతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
Stock Market: మోదీ, ట్రంప్ భేటీ వేళ.. స్టాక్ మార్కెట్లు తీరు ఎలా ఉందంటే..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Read More Business News and Latest Telugu News