Bad News For BCCI: బీసీసీఐకి భారీ షాక్..ఐపీఎల్‌కి రూ.6600కోట్ల నష్టం!
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:14 PM
ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ జరుగుతోంది. దీని ద్వారా బీసీసీఐకి ఏటా కోట్ల రూపాయాలు లాభం వస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఓ బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అలానే ఈ లీగ్ ప్రారంభమైందంటే చాలు..జనాలు మొదలు బెట్టింగ్ రాయుళ్ల వరకు అందరికీ పండగే. ఇది ఇలా ఉంటే.. ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలానే బీసీసీఐకి ఏటా కోట్ల రూపాయాలు లాభం వస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఓ బిగ్ షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) కారణంగానే బీసీసీఐ(BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అవతరించగలిగింది. ఇదే సమయంలో ఇటీవల ఐపీఎల్ విలువలో భారీ క్షీణత కనిపించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఈ టోర్నమెంట్ విలువ తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.6,600 కోట్ల నష్టం(Massive LOSS) వాటిల్లిందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
ఓ రిపోర్ట్ ప్రకారం.. 2026లో ఐపీఎల్ విలువ రూ.76,100 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది ఐపీఎల్ విలువ రూ.82,700 కోట్లుగా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి రూ.6,600 కోట్ల నష్టం(BCCI Financial Loss) వాటిల్లింది.2024లో హాట్‌స్టార్, వయాకామ్18 విలీనం కారణంతోనే బీసీసీఐకి నష్టం జరిగిందని నివేదిక చెబుతుంది. ఆ రెండు సంస్థలు వేరుగా ఉన్నప్పుడు మార్కెట్‌లో ఉన్న పోటీ క్రికెట్ బోర్డుకు లాభదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసిపోవడంతో అది బీసీసీఐ(BCCI) లాభాలపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Commonwealth Games 2030: అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ క్రీడలు
India Team Departs for Australia: ఆసీస్‌కు పయనం
Williamson Joins LSG : IPL 2026లో కొత్తగా కనిపించనున్న కేన్ మామ!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి