India Team Departs for Australia: ఆసీస్‌కు పయనం
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:34 AM
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం ఆ దేశానికి పయనమైంది. ఈ సిరీ్‌సలో భాగంగా టీమిండియా, ఆసీస్ మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడనున్నాయి...
రెండు బృందాలుగా వెళ్లిన టీమిండియా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం ఆ దేశానికి పయనమైంది. ఈ సిరీ్‌సలో భాగంగా టీమిండియా, ఆసీస్ మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడనున్నాయి. తొలుత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే ఈనెల 19న పెర్త్‌లో జరగనుంది. తొలి విడతగా రోహిత్, విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, పేసర్లు అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, జట్టు సహాయ సిబ్బంది కొందరు ఆస్ట్రేలియా పయనమయ్యారు. ఉదయాన్నే భారత జట్టు బయలు దేరినా..ఆ సమయానికే క్రికెట్ అభిమానులు విమానాశ్రయానికి తరలి వచ్చి వీడ్కోలు పలకడం విశేషం. ప్రధాన కోచ్ గంభీర్, ఇతర సహాయ సిబ్బంది సాయంత్రం బయలు దేరారు. ఇక..ఈ సిరీ్‌సలో వన్డే మ్యాచ్‌లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. కారణం..టె్‌స్టలు, టీ20ల నుంచి రిటైర్ అయిన దిగ్గజ బ్యాటర్లు రోహిత్, కోహ్లీలు ఆసీ్‌సతో సిరీస్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లకూ వీడ్కోలు పలకనున్నారని ఇటీవల వార్తలు రావడమే. రో-కో ద్వయం వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొంటారా అన్న ప్రశ్నకు..ఆ మెగా టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయముందని వెస్టిండీ్‌సతో రెండో టెస్ట్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు గంభీర్ బదులివ్వడం గమనార్హం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్‌సలో రోహిత్, కోహ్లీ సత్తా మేరకు ఆడగలరన్న ఆశాభావాన్ని గంభీర్ వ్యక్తంజేశాడు.
హీరో..ఎలా ఉన్నావ్?
భారత జట్టు ఆస్ట్రేలియా పయనమైన సందర్భంగా న్యూఢిల్లీ విమానాశ్రయంలో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వన్డే కొత్త కెప్టెన్ గిల్..రోహిత్ ఒకరి నొకరు హగ్ చేసుకున్నారు. రోహిత్ భుజంపై గిల్ చేయి వేయగా ‘కొత్త హీరో.. ఎలా ఉన్నావ్’ అని రోహిత్ నవ్వుతూ స్పందించాడు. విరాట్ పెద్దగా నవ్వుతూ గిల్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోపాటు కొత్త సారథిని భుజం తట్టి ప్రోత్సహించాడు. ఈమేరకు బీసీసీఐ వీడియో విడుదలజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News