Share News

Ex-boyfriend revenge story: వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:59 PM

బ్రేకప్ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అప్పటివరకు ఎంతగానో ప్రేమించిన వ్యక్తికి దూరం కావడాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఈ బాధ నుంచి కొందరు త్వరగానే బయటపడతారు. మరి కొందరు మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ప్రేమించిన వారిని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తారు.

Ex-boyfriend revenge story: వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..
ex-boyfriend revenge story

బ్రేకప్ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అప్పటివరకు ఎంతగానో ప్రేమించిన వ్యక్తికి దూరం కావడాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఈ బాధ నుంచి కొందరు త్వరగానే బయటపడతారు. మరి కొందరు మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ప్రేమించిన వారిని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తారు. ఆ బాధలో తమను తాము హింసించుకునే వారు కొందరు. ఎదుటి వారిని హింసించాలనుకునే వారు మరికొందరు. తాజాగా ఇంగ్లండ్‌లో ఓ యువతి అలాగే ప్రవర్తించింది (love and betrayal).


ఇంగ్లండ్‌కు చెందిన రోజ్ అనే యువతికి కొంతకాలం క్రితం బ్రేకప్ అయింది. ప్రియుడు దూరమయ్యాడు. దీనిని ఆమె తట్టుకోలేకపోయింది. తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకోసం ఆమె ఒక మహిళా మంత్రగత్తెను ఆశ్రయించింది (tantric revenge). మాజీ ప్రియుడి జీవితంలో విధ్వంసం సృష్టించడానికి ఆమె సహాయం తీసుకోవాలనుకుంది. ఆమె తన ప్రేమాయణం గురించి, తన ప్రియుడు తనను విడిచిపెట్టడం గురించి చెప్పింది. అతడికి ఎలా గుణపాఠం చెప్పాలనుకుంటోందో వివరించింది. ఆ మంత్రగత్తె తనకు సహాయం చేస్తుందని నమ్మింది.


కొన్ని రోజుల తర్వాత మంత్రగత్తెను కలిసి తన మాజీ ప్రియుడి గురించి అడిగింది (ritual gone wrong). అప్పుడు మంత్రగత్తె రోజ్‌కే షాకిచ్చింది. ఆమె నుంచి విడిపోయిన వ్యక్తి గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పింది. గుణపాఠం నేర్చుకోవాల్సింది నువ్వేనని చెప్పడంతో రోజ్ ఆశ్చర్యపోయింది. ప్రతికారం తీర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదని హితువు చెప్పింది. నీ గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకుని చికిత్స తీసుకోవాలని సూచించింది. ఈ కథ మొత్తాన్ని రోజ్ తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

1638 క్రెడిట్ కార్డులతో గిన్నీస్ రికార్డు.. ఎలా వాడుతున్నాడంటే..


మీ బ్రెయిన్ సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న రెండో మనిషిని కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2025 | 02:59 PM