Share News

Deccan Cement Controversy: మంత్రుల కేబినెట్ కాదు.. మాఫియా డాన్ల కేబినెట్: ఆర్ఎస్ ప్రవీణ్

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:46 PM

ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్ రెడ్డి ఆఫీస్‌లోనే తుపాకీ పెట్టి బెదిరించటమే ఇందుకు నిదర్శనమన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు తెలిపారు.

Deccan Cement Controversy: మంత్రుల కేబినెట్ కాదు.. మాఫియా డాన్ల కేబినెట్: ఆర్ఎస్ ప్రవీణ్
Deccan Cement Controversy

హైదరాబాద్, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మంత్రుల క్యాబినెట్ కాదని.. మాఫియా డాన్ల క్యాబినెట్ అంటూ బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరుడు రోహిన్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటా బయటకు తీస్తే దొంగల ముఠా బయటకు వస్తుందన్నారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నిజాలు చెప్పిందని అన్నారు. సీఎం రేవంత్ అనుచరుడు రోహిన్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని విమర్శించారు. రోహిన్ రెడ్డి ఆఫీస్‌లోనే తుపాకీ పెట్టి బెదిరించటమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు తెలిపారు. డెక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళను బెదిరించిన వెపన్ ఎవరిదో విచారించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.


రాష్ట్రాన్ని పాలిస్తుంది మీనాక్షి నటరాజనా? రేవంత్ రెడ్డినా? అని ప్రశ్నించారు. కమీషన్ పంపకాల్లో తేడా రావటం వల్లనే.. మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఇంటికి వెళ్ళి నిందితుడిని పట్టుకురాలేని పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయిందంటూ కామెంట్స్ చేశారు. మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చున్నారంటూ విమర్శలు గుప్పించారు. తనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మీ జవాన్ చెప్పినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు.


స్థానిక ఏసీపీ తిరుపతి రెడ్డి ఫిర్యాదు తీసుకోవటం లేదని ఆర్మీ జవాన్ స్వయంగా చెప్తున్నారన్నారు. అవినీతిలో వాటాల కోసం మంత్రులు బహిరంగంగా కొట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు దుకాణాలు తెరుచుకుని ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యులకు ఒక న్యాయం.. మంత్రులకు మరొక న్యాయమా? అని నిలదీశారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎపిసోడ్‌పై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 03:26 PM