Share News

BJP Vs Congress: మంత్రి కూతురి ఆరోపణలపై విచారణ చేయాల్సిందే: రామచంద్ర రావు

ABN , Publish Date - Oct 16 , 2025 | 01:55 PM

కాంగ్రెస్, కరెప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయని... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోందన్నారు.

BJP Vs Congress: మంత్రి కూతురి ఆరోపణలపై విచారణ చేయాల్సిందే: రామచంద్ర రావు
BJP Vs Congress

హైదరాబాద్, అక్టోబర్ 16: డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Telangana BJP Chief Ramachandra Rao) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ‘పోలీసులు ఓ మంత్రి ఇంట్లోకి వెళ్ళారు. మంత్రి కూతురు.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మందిపై ఎలిగేషన్ చేశారు. సిమెంట్ కంపెనీల యజమానులను బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. కాంగ్రెస్, కరెప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలి. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోంది. టికెట్‌లు కూడా దోచుకునే వారికే ఇస్తున్నారు’ అని మండిపడ్డారు.


మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దోచుకున్న సొత్తు పంచుకుంటున్నారని.. ఇప్పుడు దోచుకున్న సొత్తు పెంచుకునేందుకు తప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణను దోచుకున్న పార్టీలను ఓడించాలన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ.. అవినీతి, తప్పుడు పాలన, దోపిడీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని బీజేపీరాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు వెల్లడించారు.


రామచంద్ర రావు ఇంకా మాట్లాడుతూ.. స్థానికంగా తయారైన వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. చేతి వృత్తులు భారత దేశంలో అనేక వస్తువులు ఉన్నాయని.. భూవనగిరి, గద్వాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో చేతి వృత్తులకు ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇలాంటి వృత్తి చేసేవారు ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేలా స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని బీజేపీ ఆలోచన చేస్తోందన్నారు. భారత వస్తువులకు బయట కూడా డిమాండ్ రావాలని.. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్ట్రీమిజంను నిర్మూలిస్తామని చెప్పామని.. నిన్న అనేక మంది మావోలు ప్రభుత్వం ముందు లొంగిపోయారన్నారు. చాలామంది అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ లొంగి పోయారనితెలిపారు. లెఫ్ట్ వింగ్ ఎక్ట్రీమిజం ఫ్రీ భారతదేశంగా మారుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 03:00 PM