Pet Dog Causes House Fire: కుక్క ఎంత పని చేసింది.. ఇల్లు తగలబడి పోయింది..
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:00 PM
కుక్క, పిల్లి అక్కడినుంచి పరుగులు పెట్టాయి. మంటల కారణంగా ఇంట్లోని ఫైర్ అలారం మోగటంతో చాపెల్ హిల్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది.
పెంపుడు కుక్కలన్న తర్వాత ఇంట్లో అల్లరి చేస్తాయి. అటు, ఇటు దూకుతూ.. వస్తువుల్ని కిందపడేస్తూ ఇళ్లంతా పాడు చేస్తాయి. ఇంత వరకు బాగానే ఉంది. చెత్త పడితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇల్లే తగలబడిపోతే. ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ కుక్క కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబం కాల్టన్ అనే కుక్కను పెంచుకుంటోంది. కాల్టన్ ఓ అల్లరి కుక్క. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యులందరూ కుక్కను ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లారు. ఆ కుక్క, ఓ పిల్లి మాత్రమే ఇంట్లో ఉన్నాయి. పిల్లి సైలెంట్‌గా ఓ మూల పడుకుండిపోయింది.
కుక్క మాత్రం అటు, ఇటు గెంతుతూ.. వస్తువుల్ని కొరుకుతూ ఆడుకోసాగింది. ఈ నేపథ్యంలోనే దానికి ఓ లిథియం బ్యాటరీ దొరికింది. అది ఆ బ్యాటరీని కొరకసాగింది. కొద్దిసేపటి తర్వాత బ్యాటరీ పేలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావటంతో కుక్క, పిల్లి అక్కడినుంచి పరుగులు పెట్టాయి. మంటల కారణంగా ఇంట్లోని ఫైర్ అలారం మోగటంతో చాపెల్ హిల్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. లేదంటే ఇల్లు మొత్తం తగలబడిపోయేది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
మీ తెలివికి పరీక్ష.. ఈ ఫొటోలో ఏనుగు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?