Share News

CM Chandrababu Naidu’s Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:06 PM

రాజధాని అమరావతితోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటిమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

CM Chandrababu Naidu’s Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?
AP CM Chandrababu

అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖారారు అయింది. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు నాయుడు బ్రిటన్ రాజధాని లండన్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్‌లోని పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి ఆయన సోదాహారణగా వివరించనున్నారు. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆ పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.


సీఎం చంద్రబాబు, సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతోపాటు పలువురు అధికారుల బృందం లండన్ బయలుదేరి వెళ్లనుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు.


అక్టోబర్ 22 నుంచి..

మరోవైపు అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు.


ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌తోపాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడుదారులను ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.


ఇప్పటికే పలు విదేశీ పర్యటనలు..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతితోపాటు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం సర్కార్ కీలకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే సింగపూర్, దావోస్‌లో సైతం ఆయన పర్యటించారు.


తూర్పు తీర నగరంలో..

విశాఖపట్నం వేదికగా నవంబర్‌లో రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. భారీ ఎత్తున నిర్వహించే ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపాటు పలువురు ఉన్నతాధికారులు సైతం దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వాధికారులతోపాటు పారిశ్రామికవేత్తలతో ఈ బృందం వరుస భేటీలు నిర్వహించింది. ఆ దేశ ప్రతినిధి బృందాన్ని సైతం ఈ సదస్సుకు మంత్రి నారాయణ ఆహ్వానించిన విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ విదేశీ పర్యటన రద్దుపై విచారణ.. కోర్టు ఏం చెప్పిందంటే..

చికెన్ షాపులపై కీలక నిర్ణయం..

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 03:19 PM