Share News

Woman Funny Video: ఫోన్ వాడడమే కాదు.. దాచడమూ తెలుసు.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - May 10 , 2025 | 02:03 PM

ఓ యువతి కీప్యాడ్ ఫోన్‌ను వాడుతోంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఫోన్ వాడడం ఓకేగానీ.. ఆ ఫోన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా దాచి పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Woman Funny Video: ఫోన్ వాడడమే కాదు.. దాచడమూ తెలుసు.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరి వద్దా ఫోన్ ఉండడం సర్వసాధారణమైంది. ఇక యువతీయువకులైతే ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితిలోకి వెళ్లారు. కొందరు యువతులు తమ తల్లిదండ్రులకు తెలీకుండా ఫోన్లను వాడడం కూడా చూస్తున్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి కీప్యాడ్ ఫోన్ దాచి పెట్టిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమెకు ఫోన్ వాడడమే కాదు.. దాచడమూ తెలుసు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి కీప్యాడ్ ఫోన్‌ను వాడుతోంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఫోన్ వాడడం ఓకేగానీ.. ఆ ఫోన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా దాచి పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Train Funny Video: ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సింగిల్ సీటునే స్లీపర్‌గా మార్చేశాడుగా..


జుట్టును ముడివేసుకుంుటన్న ఆమె.. పతన చేతిలోని కీప్యాడ్ ఫోన్‌ను (Young woman hides keypad phone in her hair) అందులో దాచి పెట్టేసింది. జుట్టు మధ్యలో ఫోన్ పెట్టి, దానిపై వెంట్రుకలను కప్పేసి.. ఎవరికీ అనుమానం రాకుండా మొత్తం ముడి వేసేసింది. చూసేందుకు జుట్టును ముడి వేసుకున్నట్లుగా ఉంది తప్పితే.. అందులో ఫోన్ ఉందనే డౌట్ కూడా లేకుండా కవర్ చేసింది.

Elephant Viral Video: రోడ్డు మధ్యలో ఏనుగు.. ఎదురుగా వచ్చిన స్కూటరిస్ట్.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్‌ను ఇలాక్కూడా దాచిపెట్టవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Monkey Funny Viral Video: లస్సీ తర్వాతే ఏదైనా.. ఈ కోతి నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..


ఇవి కూడా చదవండి..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 10 , 2025 | 02:03 PM