Monkey Funny Viral Video: లస్సీ తర్వాతే ఏదైనా.. ఈ కోతి నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..
ABN , Publish Date - May 10 , 2025 | 12:42 PM
ఓ పర్యాటక ప్రాంతంలో రోడ్డు పక్కన చెత్తకుండీపై రెండు కోతులు కూర్చుని ఉంటాయి. వాటిలో ఓ కోతికి చెత్త కుండీలో తాగి పడేసిన లస్సీ గ్లాసు దొరుకుతుంది. దాన్ని తింటున్న సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వాటికి ఆకలి వేసిందంటే.. ఎలా ప్రవర్తిస్తాయో అందరికీ తెలిసిందే. మనుషుల చేతుల్లోని ఆహార పదార్థాలను లాక్కెళ్లిపోయే కోతులు కొన్ని అయితే.. మరి కొన్ని వస్తువుకు వస్తువు బదులు.. అన్నట్లుగా, ఫోన్లు తదితర వస్తువులు ఎత్తుకెళ్లి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను వాటి వద్దకే తెప్పించుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ కోతి విచిత్రంగా ప్రవర్తించడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సీరియస్‌గా లస్సీ టేస్ట్ చేస్తున్న కోతికి ఓ వ్యక్తి అరటిపండు ఇవ్వబోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పర్యాటక ప్రాంతంలో రోడ్డు పక్కన చెత్తకుండీపై రెండు కోతులు కూర్చుని ఉంటాయి. వాటిలో ఓ కోతికి చెత్త కుండీలో తాగి పడేసిన లస్సీ గ్లాసు దొరుకుతుంది. దాన్ని తీసుకున్న కోతి.. అందులో అడుగున ఉన్న లస్సీని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుకపై చప్పరిస్తూ ఉంటుంది.
Elephant Viral Video: రోడ్డు మధ్యలో ఏనుగు.. ఎదురుగా వచ్చిన స్కూటరిస్ట్.. చివరకు..
లస్సీ రుచి బాగా నచ్చడంతో గ్లాసు అడుగున ఉన్న లస్సీని ఎంతో (Monkey tasting lassi) ఇష్టంగా తింటూ ఉంటుంది. అయితే మధ్యలో ఓ వ్యక్తి ఆ కోతికి అరటి పండు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కోతి ముందు అరటి పండు పట్టుకుని నిలబడతాడు. అయినా ఆ కోతి అదేమీ పట్టించుకోకుండా.. లస్సీ తినడంలో నిమగ్నమై ఉంటుంది. అయితే ఎదురుగా అరటిపండు పట్టుకుని ఉండడం చూసి కోతికి చిర్రెత్తుకొస్తుంది.
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
‘‘ఏహే.. ఎంతో ఇష్టంగా లస్సీ తింటుంటే.. మధ్యలో నీ అరటిపండు గోల ఏంటీ.. ఈ లస్సీ ముందు ఏదీ నచ్చదు’’.. అంటూ ఇలా చేతిలోకి తీసుకుని, ( monkey threw the banana in Dust bin) అలా చెత్తబుట్టలో పడేస్తుంది. కోతి విచిత్ర నిర్వాకం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లస్సీ ముందు అరటిపండు వేస్ట్’’.. అంటూ కొందరు, ‘‘లస్సీకి ఫిదా అయిన కోతి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 9 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Train Funny Video: ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సింగిల్ సీటునే స్లీపర్‌గా మార్చేశాడుగా..
ఇవి కూడా చదవండి..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..