Funny Viral Video: కడుపు నిండే వరకూ కదిలేదే లేదు.. వర్షంలో ఇతడి నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Jun 18 , 2025 | 08:06 PM
ఓ వివాహ కార్యక్రమంలో అతిథులంతా భోజనాలు చేస్తుండగా.. ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా భోజనాలు చేస్తున్న వారంతా.. బంతిలో నుంచి లేచి పరుగు పరుగున టెంట్ కిందకు చేరుకున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు..

ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి కార్యక్రమం ముగిసే వరకూ ఏదో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. కొన్నిసార్లు భోజనాల వద్ద తోసుకోవడం చూస్తుంటాం. పెనంపై దోసెలు వేసి వేయగానే లాక్కోవడం, మాంసం ముక్కల కోసం ఫైటింగ్ చేసుకోవడం వంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో అతిథులంతా భోజనాలు చేస్తుండగా.. ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా భోజనాలు చేస్తున్న వారంతా.. బంతిలో నుంచి లేచి పరుగు పరుగున టెంట్ కిందకు చేరుకున్నారు.
అంతా తింటున్న ప్లేట్లను అక్కడే వదిలేసి పారిపోతుంటే.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం కూర్చున్న చోటు నుంచి ఇంచుకూడా కదల్లేదు. పైగా అంత వర్షంలోనూ తినడం మాత్రం ఆపలేదు. ఓ వైపు వర్షం పడి బట్టలు మొత్తం పూర్తిగా తడిచిపోతున్నా (Man Eating In The Rain) పట్టించుకోకుండా తింటూనే ఉన్నాడు. ఇతడి విచిత్ర ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘కడుపు నిండే వరకూ ఇంచు కూడా కదిలేది లేదు’.. అంటూ కొందరు, ‘ఇది కదా నిబద్ధత అంటే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89వేలకు పైగా లైక్‌లు, 7.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..