Share News

Tricks Viral Video: ట్రిక్ మామూలుగా లేదుగా.. నీళ్ల నుంచి పెట్రోల్‌ను ఎలా వేరు చేశాడో చూస్తే..

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:22 PM

ఓ వ్యక్తి చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఉంటాడు. ఆ బాటిల్‌లో సగాని కంటే పైగా నీళ్లు ఉండగా.. మిగతా భాగం పెట్రోల్ ఉంటుంది. అడుగున ఉన్న పెట్రోల్‌ వృథా కాకుండా నీటిని వేరు చేసేందుకు అతను వినూత్నమైన ట్రిక్‌ను ప్రయోగించాడు.

Tricks Viral Video: ట్రిక్ మామూలుగా లేదుగా.. నీళ్ల నుంచి పెట్రోల్‌ను ఎలా వేరు చేశాడో చూస్తే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్న వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. అలగే ఇంకొన్ని వీడియోలను చూసినప్పుడు.. అరే.. ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. కొందరు పెద్ద పెద్ద సమస్యలకు సింపుల్‌గా పరిష్కారాలు కనుక్కుంటుంటారు. తాజాగా, ఇలాంటి వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీళ్లలో నుంచి పెట్రోల్‌ను వేరు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ట్రిక్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఉంటాడు. ఆ బాటిల్‌లో సగాని కంటే పైగా నీళ్లు ఉండగా.. మిగతా భాగం పెట్రోల్ ఉంటుంది. అడుగున ఉన్న పెట్రోల్‌ వృథా కాకుండా నీటిని వేరు చేసేందుకు అతను వినూత్నమైన ట్రిక్‌ను ప్రయోగించాడు.


వాటర్ బాటిల్‌ను తన అరచేతిపై తలకిందులుగా (Man holding water bottle upside down) పట్టుకుంటాడు. ఆ తర్వాత బాటిల్‌ను కొంచెం పైకి ఎత్తుతూ నీళ్లన్నింటినీ బయటికి వదిలేస్తాడు. తీరా పెట్రోల్ మూత దగ్గరికి రాగానే బాటిల్‌ను మళ్లీ పైకి తిప్పుతాడు. ఇలా నీళ్లన్నింటినీ బయటికి వదిలి, పెట్రోల్‌ను (Petrol) మాత్రం సేవ్ చేస్తాడన్నమాట. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘వావ్.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా’. .అంటూ కొందరు, ‘ఇతను ఎంతో తెలివిగా వ్యవహరించాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 17 , 2025 | 09:22 PM