Monkey Funny Video: భోజనం వడ్డిస్తున్న కోతి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:00 PM
ఓ కోతి రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ వద్ద (Monkey serving food) నిలబడి భోజనం వడ్డిస్తుంటుంది. ఓ చేతిలో గరిటె, మరో చేతిలో ప్లేటు పట్టుకుని ఉంటుంది. పులిహోరను ప్లేటులోకి వేసి, అందులో కూర వేసి కస్టమర్లకు అందిస్తుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు..

కోతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం తరచూ చూస్తుంటాం. కొన్నిసార్లు కోతులు మనుషులను అనుకరిస్తే.. మరికొన్నిసార్లు మనుషులను భయపెడుతూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి భోజనం వడ్డించడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ వద్ద (Monkey serving food) నిలబడి భోజనం వడ్డిస్తుంటుంది. ఓ చేతిలో గరిటె, మరో చేతిలో ప్లేటు పట్టుకుని ఉంటుంది. పులిహోరను ప్లేటులోకి వేసి, అందులో కూర వేసి కస్టమర్లకు అందిస్తుంది.
ఆ తర్వాత మరో ప్టేటులో చికెన్, చపాతీ కూడా వడ్డిస్తుంది. ఆహారాన్ని చూడగానే తినేసే కోతులు.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్లేటులో వడ్డించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అక్కడున్న వారంతా ఈ కోతిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాంసాన్ని ముట్టుకోని కోతి చేత.. ఇలా చికెన్ వడ్డిస్తున్నట్లు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేయడమేంటని మండిపడుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా క్రియేట్ చేయడం చాలా తప్పు’.. అంటూ కొందరు, ‘కోతులు ఇలా చేయవు.. ఇదంతా ఏఐ టెక్నాలజీతో చేశారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..