Jaipur Auto Driver: ఫ్రెంచ్ భాషలో అదరగొట్టిన ఆటో డ్రైవర్
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:28 PM
ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్రెంచ్ లో అనర్గాళంగా మాట్లాడిన విధానంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఫ్రెంచ్ పౌరులకు ఏమాత్రం తీసిపోకుండా..అచ్చం వారు మాట్లాడినట్లే, అదే బాడీ లాంగ్వేజ్ లో సదరు ఆటో డ్రైవర్ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
నిత్యం సోషల్ మీడియా(Social Media)లో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని మాత్రం మనల్ని షాకింగ్ కు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా కొందరు పాటలు పాడుతూ, అదిరిపోయే డ్యాన్సులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్రెంచ్ లో అనర్గళంగా మాట్లాడిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఫ్రెంచ్(French) పౌరులకు ఏమాత్రం తీసిపోకుండా..అచ్చం వారు మాట్లాడినట్లే, అదే బాడీ లాంగ్వేజ్ లో సదరు ఆటో డ్రైవర్ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్‌లోని(Rajsthan) జైపూర్ చెందిన ఓ డ్రైవర్ ను బైనాయిడ్ అనే ఫ్రెంచ్ టూరిస్టు సోషల్ మీడియాలో ఫేమస్ చేశాడు. బెనాయిట్ జైపూర్ లో పర్యటించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ అనర్గళంగా మాట్లాడిన ఫ్రెంచ్ కు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన కంటే ఎంతో బెటర్ గా ఆటో డ్రైవర్ ఫ్రెంచ్ లో మాట్లాడినట్లు బెనాయిడ్ తెలిపారు. అంతేకాక తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను బెనాయిట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో.. "నేను పర్యాటకులతో ఫ్రెంచ్ మాట్లాడతాను" అని అతను స్వచ్ఛంగా ఫ్రెంచ్‌లో బైనాయిడ్ తో సంభాషించాడం కనిపిస్తుంది. " నాకంటే నీకు మంచి ఫ్రెంచ్ యాస ఉందా?" అని బెనాయిట్ సరదాగా అడిగాడు.
బైనాయిడ్ అడిగిన ప్రశ్నకు.. సదరు డ్రైవర్ సమాధానం ఇస్తూ.. "అవును, ఎందుకు కాదు? ఇదే జీవితం. నీకు ఏదో కావాలి, నాకు ఏదో కావాలి... అదే జీవితం. నీవు నాకు తెలియదు. నేను నీకు తెలియదు. ఈ భాషే మనిద్దరిని కలిపింది" అని ఫ్రెంచ్ భాషలో డ్రైవర్ చెప్పిన మాటలకు బెనాయిట్ ఆశ్చర్యపోయాడు. అతడిని ఇన్‌క్రైయబుల్ వ్యక్తిగా అభివర్ణించాడు. నిత్యం ఎంతో మంది ఫ్రెంచ్ టూరిస్టులు తన ఆటోలో జర్నీ చేయడం వల్లే ఇది సాధ్యమైందని సదరు ఆటో డ్రైవర్ తెలిపాడు. ఈ వీడియోలు 1.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఆ ఆటోవాలా నెటిజన్లను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడు అనేది. అతడు నిజంగానే ఫ్రెంచ్(French) వ్యక్తేనా అనేలా ఉన్నాడని కొందరు, అతడి వృత్తి, అతని అవసరమే ఫ్రెంచ్ ను ఇంత అనర్గళంగా మాట్లాడేలా చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి