Canada Racism: కెనడాలో భారతీయుడిపై దాడి.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:49 PM
కెనడాలో వలసదారులపై రోజురోజుకూ జాత్యహంకారం పెరిగిపోతోంది. ఇప్పటికే విదేశీయులపైన వివిధ దాడులు జరిగాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న విదేశీయులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో వలసదారులపై రోజురోజుకూ జాత్యహంకారం పెరిగిపోతోంది. ఇప్పటికే విదేశీయులపైన వివిధ దాడులు జరిగాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న విదేశీయులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారతీయుడి(Indian in Canada)పై ఓ కెనెడియన్ దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ కారణం లేకుండానే ఈ దాడి జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
శనివారం(నవంబర్ 1న)నాడు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రకారం.. టొరంటో బ్లూ జేస్ జాకెట్ ధరించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రెస్టారెంట్(Toronto McDonald’s)లోని 'మొబైల్ ఆర్డర్ పికప్' కౌంటర్ వద్ద నిలబడి ఉన్న బాధితుడి(Indian in Canada) వద్దకు వెళ్లి, ఎలాంటి కారణం లేకుండా అతడిని నెట్టేశాడు. దీంతో బాధితుడి చేతిలోని ఫోన్ ఎగిరి.. చాలా దూరంలో పడింది. అయినా బాధితుడు ఎలాంటి ప్రతి చర్యకు దిగకుండా దూరంగా పడిన తన ఫోన్ ను తీసుకున్నాడు. ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తి.. మరింత రెచ్చిపోయాడు. బాధితుడి కాలర్ పట్టుకుని వెనక్కి నెట్టాడు. 'నా ముందు గొప్పోడిలా ఫోజు ఇస్తావా?' అంటూ ఆ వ్యక్తి ఆరోపణలు చేయడం వీడియోలో వినిపిస్తోంది.
బాధితుడు ఎలాంటి ప్రతిఘటన చూపకుండా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో అక్కడి సిబ్బంది జోక్యం చేసుకుని, గొడవను బయట చూసుకోవాలని సదరు వ్యక్తికి సూచించారు. అనంతరం ఆ కెనడా జాతీయుడి(Canada Racism)ని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వీడియో( Viral Video)లో ఉన్న ఇద్దరి వివరాలూ ఇంకా తెలియరాలేదు. ఇటీవల కెనడాలోని ఎడ్మంటన్‌లో భారత సంతతికి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త అర్వీ సింగ్ సాగూను ఓ అపరిచితుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్నిరోజులకే ఈ ఘటన(Immigrant Safety) జరగడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
Train Collision: రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి