PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Jan 07 , 2025 | 07:47 AM

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నూతన టెర్మినల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న , ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 1/13

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నూతన టెర్మినల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 2/13

వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో భారతీయ రైల్వేల అభివృద్ధి కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 3/13

తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకామనీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 4/13

రైల్వే మౌలిక సౌకర్యాల ఆధునికీకరణ, ప్రయాణికులకు అధునాతన సదుపాయాల కల్పన, దేశంలో మూలమూలకూ రైల్వే కనెక్టివిటీ కల్పించడం, ఉద్యోగ కల్పన, పరిశ్రమలకు అండగా నిలవడంలో రైల్వేలకూ ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాల ఆధారంగా భారతీయ రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 5/13

సోమవారం తెలంగాణలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌తోపాటు జమ్మూ రైల్వే డివిజన్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. రాయగడ రైల్వే డివిజన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 6/13

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 7/13

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని, తాము కూడా కేంద్రానికి సాకారం అందించామని గుర్తుచేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవంలో ఐటీ ప‌రిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 8/13

రైల్వే మౌలిక సౌకర్యాల ఆధునికీకరణ, ప్రయాణికులకు అధునాతన సదుపాయాల కల్పన, దేశంలో మూలమూలకూ రైల్వే కనెక్టివిటీ కల్పించడం, ఉద్యోగ కల్పన, పరిశ్రమలకు అండగా నిలవడంలో రైల్వేలకూ ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాల ఆధారంగా భారతీయ రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ వివరించారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 9/13

‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’ మంత్రం అమల్లో కేంద్ర ప్రభుత్వం విశ్వాసపూరితంగా ముందుకెళ్తోందని చెప్పారు. పదేళ్లుగా దేశంలో రైల్వేల పురోగతి వేగవంతంగా జరుగుతోందని అన్నారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 10/13

21వ శతాబ్దంలో అవసరమైన మౌలికవసతుల కల్పన జరుగుతోందని, కొత్త ఉపాధి కల్పన కూడా పెరుగుతుందని చెప్పారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 11/13

వందే భారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు.. భారతదేశానికి కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయని వివరించారు. సుదూర ప్రయాణాలను సైతం తక్కువ సమయంలో పూర్తిచేసే ఆలోచనతో ప్రజలు ఉన్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 12/13

వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూసి చాలా సంతోషం కలిగిందని చెప్పారు.

PM MODI: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 13/13

30 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ కొత్త లైన్లు వేశామని, వేల సంఖ్యలో ఆర్‌యూబీ, ఆర్‌వోబీల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.

Updated at - Jan 07 , 2025 | 02:34 PM