Kavitha : రేవంత్‌కు కవిత పదివేల పోస్టు కార్డులు.. ఎందుకంటే
ABN, Publish Date - Mar 03 , 2025 | 02:45 PM
రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆరుగ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని కోరుతూ కవిత పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10 వేల పోస్టుల కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు.

రేవంత్ ఇచ్చిన హామీలను మార్చి 8వ తేదీ లోపు అమలు చేయాలని డెడ్‌లైన్ విధించారు.

మహిళలకు నెలకు రూ.2500 హామీపై వెంటనే ప్రకటన చేయాలని లేకపోతే లక్షలాది పోస్టు కార్డులను రాసి ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పంపిస్తామని కవిత హెచ్చరించారు.

ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా బిల్లుపై సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే ఢిల్లీలో తాము ధర్నా చేశామని కవిత గుర్తు చేశారు.
Updated at - Mar 03 , 2025 | 02:45 PM