CM Revanth Reddy: మేడ్చల్ జిల్లాలో జై హింద్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - May 29 , 2025 | 07:28 PM
ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో ఇవాళ(గురువారం) జై హింద్ యాత్ర నిర్వహించారు. బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జైహింద్ యాత్ర కొనసాగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జై హింద్ యాత్ర అనంతరం నిజాంపేట కొలన్ గోపాల్‌రెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
1/13
ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో ఇవాళ(గురువారం) జై హింద్ యాత్ర నిర్వహించారు.
2/13
బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జైహింద్ యాత్ర కొనసాగింది.
3/13
ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
4/13
జై హింద్ యాత్ర అనంతరం నిజాంపేట కొలన్ గోపాల్‌రెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
5/13
పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
6/13
యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
7/13
నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
8/13
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మోదీ నిర్ణయాలకు తాము అండగా నిలిచామని ఉద్గాటించారు. దేశంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
9/13
ఉగ్రవాదులను తుదముట్టించేవరకు సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని మోదీతో చెప్పామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
10/13
భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్ ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యుద్ధం ఆపాలని ఇందిరాగాంధీని అమెరికా అధ్యక్షుడు బెదిరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
11/13
ఇందిరాగాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
12/13
పాకిస్థాన్‌ని ఓడించినందుకా కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
13/13
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీ సొంత వ్యవహారం కాదని స్పష్టం చేశారు.
Updated at - May 30 , 2025 | 02:29 PM