BRS Leaders: మిర్చి రైతుల దగ్గరకు బీఆర్ఎస్ నేతలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Feb 25 , 2025 | 08:08 PM
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం నాడు బీఆర్ఎస్ నేతలు రైతులను పరామర్శించారు. రైతులను కలిసిన వారిలో మాజీ మంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం నాడు బీఆర్ఎస్ నేతలు రైతులను పరామర్శించారు.

రైతులను కలిసిన వారిలో మాజీ మంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

రైతుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు.

రేవంత్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

రైతులతో మాట్లాడుతుండగా మిర్చి ఘాటుకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మిర్చిఘాటుకు దగ్గులు తుమ్ములతో నాయకులు సతమతమయ్యారు.

మిర్చి ఘాటుకు బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Updated at - Feb 25 , 2025 | 08:15 PM