Ayodhya Balaram Temple: అయోధ్యలో కన్నుల పండువగా కాషాయ ధ్వజారోహణ.. హాజరైన పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Nov 26 , 2025 | 10:45 AM
అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, తదితరులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. జై శ్రీరామ నినాదాలతో కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
1/21
అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది.
2/21
ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, తదితరులు పాల్గొన్నారు.
3/21
రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
4/21
ఆలయ పనులు పూర్తి అయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.
5/21
కాషాయ ధ్వజం రూపకల్పనలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. త్రిభుజాకారంలో ఉన్న ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంది. దానిపైౖ శ్రీరాముడి వంశమైన భగవాన్ సూర్యుడితోపాటు ఓంకారాన్ని ముద్రించారు.
6/21
శ్రీరాముడి కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న కోవిదార వృక్షాన్ని కూడా ధ్వజంపై ముద్రించారు.
7/21
త్రేతాయుగంలో కశ్యప మహర్షి మందార, పారిజాత చెట్లను అంటుకట్టి ఈ కోవిదార వృక్షాన్ని సృష్టించినట్లు మన పురణాల్లో చెబుతారు.
8/21
శ్రీరాముడి సోదరుడైన భరతుడి రథ ధ్వజంలో ఈ వృక్షపు చిహ్నమే ఉంటుంది.
9/21
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిర్‌లో జరుగుతున్న ధర్మ ధ్వజారోహణ ఉత్సవం అపారమైన గర్వం, భక్తితో కూడిన క్షణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
10/21
అయోధ్యలో జరిగిన ధర్మ ధ్వజారోహణ ఉత్సవం చారిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అభివర్ణించారు.
11/21
ఉత్సవ శోభ సంతరించుకున్న అయోధ్యా నగరంలో వేలమంది భక్తుల ‘జైశ్రీరామ్’ నినాదాల మధ్య ప్రధాని మోదీ కాషాయ జెండాను ఆలయ శిఖరంపై రిమోట్ ద్వారా ఎగురవేశారు.
12/21
అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో భారత ఆత్మకు శతాబ్దాలుగా అయిన గాయాలు మానుతున్నాయని పేర్కొన్నారు ప్రధాని మోదీ.
13/21
నేడు భారత్‌తోపాటు మొత్తం ప్రపంచమే శ్రీరాముడి భక్తిలో మునిగిపోయిందని తెలిపారు ప్రధాని మోదీ.
14/21
అయోధ్య రామమందిరం నిర్మాణం 500 ఏళ్ల ఆకాంక్ష అని.. ఎట్టకేలకు నెరవేరిందని ప్రధాని మోదీ అన్నారు.
15/21
ఈ ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైన దైవకార్యమని అభివర్ణించారు ప్రధాని మోదీ.
16/21
త్రేతాయుగం నాటి అయోధ్య మానవతకు నైతిక మార్గంగా ఉండేదని చెప్పుకొచ్చారు. 21వ శతాబ్దపు అయోధ్య నూతన అభివృద్ధి విధానానికి చిహ్నంగా మారిందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.
17/21
ఆలయంపై రెపరెపలాడుతున్న ఈ కాషాయ జెండా విజయానికి చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ.
18/21
శ్రీ రామ జన్మభూమి మందిర్‌లో ధర్మ ధ్వజారోహణ ఉత్సవ్‌కు ముందు, సప్త్ మందిర్ కాంప్లెక్స్‌లో ప్రధాని మోదీ ప్రార్థన చేశారు.
19/21
మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్, మాతా శబరిలకు అంకితం చేసిన ఏడు పవిత్ర పుణ్యక్షేత్రాలు మనకు జ్ఞానం, భక్తి రెండింటినీ అందిస్తాయని ప్రధాని మోదీ వివరించారు.
20/21
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారితోపాటు.. ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి, రామ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.
21/21
దేవతల ప్రతిమలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ.
Updated at - Nov 26 , 2025 | 11:11 AM