CM Chandrababu: సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ఏం చేశారో మీరే చూడండి..
ABN, Publish Date - Jan 14 , 2025 | 08:28 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు. ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు.
1/12
. పండుగ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ దంపతులు గ్రామంలో మహిళలకు, పిల్లలకు ఏర్పాటు చేసిన పలు రకాల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు.
2/12
. గతేడాది సోదరుడు రామ్మూర్తినాయుడి మృతితో ఈ పర్యాయం సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వస్తుందో రాదోనని అందరూ అనుకున్నారు.
3/12
అయితే పండుగ జరుపుకొన్నా జరుపుకోకపోయినా ఆనవాయితీ ప్రకారం వచ్చారు.
4/12
చంద్రబాబు, లోకేశ్ దంపతులతో పాటు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు ఎంపీ భరత్‌లతో పాటు సన్నిహిత బంధువులు వచ్చారు.
5/12
నారావారిపల్లెలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో సోమవారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించగా పరిసర గ్రామాలకు చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
6/12
ఈ పోటీలను చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఆమె తల్లి వసుంధర తదితరులు పరిశీలించారు.
7/12
పిల్లలకు బెలూన్ బ్లాస్టింగ్, గన్నీ బ్యాగ్ రేస్, మ్యూజికల్ ఛైర్స్, లెమన్ అండ్ స్పూన్, పొటాటో గ్యాదరింగ్ వంటి పోటీలు నిర్వహించారు. సంబరాల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రధానాకర్షణగా మారారు. పిల్లలతో కొంతసేపు ఫుట్‌బాల్ ఆడారు.
8/12
ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు బహుమతులుఅందజేశారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. పిల్లల ఆటల పోటీల్లో తానుకూడా పాల్గొన్నారు.
9/12
నారావారిపల్లెతోపాటు పరిసరగ్రామాలకు చెందిన పిల్లలతో కలసి కిందనే కూర్చుని చిట్‌చాట్ చేశారు.
10/12
వారి పేర్లు, అభిరుచులు తెలుసుకున్నారు. అలాగే తన ఇష్టాలు కూడా వారితో చెప్పారు.
11/12
బెలూన్ బ్లాస్టింగ్, గన్నీ బ్యాగ్ రేస్ పోటీల్లో పాల్గొన్న దేవాన్ష్ గన్నీ బ్యాగ్ రేసులో కన్సొలేషన్ బహుమతి గెలుచుకున్నారు.
12/12
ఈ పోటీలకు మంత్రి లోకేశ్ కొంతసేపు యాంకర్‌గా వ్యవహరించి పిల్లలను ఉత్సాహపరిచారు. ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు బహుమతులుఅందజేశారు.
Updated at - Jan 14 , 2025 | 08:30 AM