ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ

ABN, Publish Date - May 18 , 2025 | 06:51 AM

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. 'యువగళం' కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 1/10

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 2/10

'యువగళం' కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 3/10

ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది .

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 4/10

2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో పొందుపరిచారు.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 5/10

యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి‌ బాటలు వేసింది.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 6/10

యువగళం పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఈ పుస్తకంపై సంతకం చేసి నారా లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందజేశారు.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 7/10

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశీర్వదించారు.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 8/10

నారా దేవాన్ష్‌‌ను అప్యాయంగా పలకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 9/10

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని మంత్రి నారా లోకేష్ కోరారు.

ప్రధాని నరేంద్రమోదీతో  ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ 10/10

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమస్కరిస్తున్న బ్రాహ్మణి

Updated at - May 18 , 2025 | 07:05 AM