విజయవాడలో అత్యాధునిక పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి అనిత
ABN, Publish Date - Jun 03 , 2025 | 07:20 AM
విజయవాడలోని సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో హోంమంత్రి అనిత మాట్లాడారు.
1/13
విజయవాడలోని సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం నాడు ప్రారంభించారు.
2/13
ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో హోంమంత్రి అనిత మాట్లాడారు.
3/13
పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ హోంమత్రి అనిత
4/13
అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పదానికి అర్థం చెప్పేలా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు.
5/13
ఏపీలోనే తొలిసారిగా మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్లోనే యోగా, జిమ్ రూములు నిర్మించినట్లు హోంమంత్రి వివరించారు.
6/13
సత్యనారాయణపురం పోలీస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్
7/13
మహిళలు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో వారి పిల్లల కోసం ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు హోంమంత్రి అనిత.
8/13
సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు హోంమంత్రి అనిత.
9/13
మోడల్ పోలీస్ స్టేషన్‌గా.. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు రికార్డు ఉందని ఉద్ఘాటించారు హోంమంత్రి అనిత.
10/13
సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కి వస్తే కార్పొరేట్ ఆఫీస్‌కి వచ్చిన అనుభూతి కలుగుతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 320 గజాల స్థలంలో రూ. 2 కోట్లతో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశామని వివరించారు.
11/13
సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో రెండువందల సీసీ కెమెరాలు పెట్టామని హోంమంత్రి అనిత వెల్లడించారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టి వారి ఫేస్ రికగ్నైజ్ పెట్టామని అన్నారు.
12/13
సీపీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను అరెస్టు చేస్తున్నారని తెలిపారు హోంమంత్రి అనిత.
13/13
ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, నేరస్థులను అరెస్టు చేస్తున్నామని ఏపీ హోంమత్రి అనిత పేర్కొన్నారు.
Updated at - Jun 03 , 2025 | 07:50 AM