Share News

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:04 PM

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..
TDP MLA NRI Meeting Melbourne

మెల్‌బోర్న్: అనంతపురం శాసన సభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెల్‌బోర్న్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఇదిలా ఉంటే, పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమంలో వీలైనంత ఎక్కువమంది ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలని నిర్ణయించినట్లు మెల్‌బోర్న్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లగడపాటి సుబ్బారావు తెలిపారు.

atp-mla.jpg


నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ వంతు సహకారం అందించాలని ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లగడపాటి సుబ్బారావుతో పాటు ఉపాధ్యక్షులు గోపి నంబల్ల, రాం ముప్పనేని, మారుతీ ప్రకాశ్, సుమ తతీన, సుమన్ దాసరి, రాం త్రిప్రనేని, శ్రీకాంత్ కోనిడనీ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నట్లుగా నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

aus-atp.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

For More AP News and Telugu News

Updated Date - Aug 04 , 2025 | 04:07 PM